Begin typing your search above and press return to search.
సినిమా అంతా చీరల్లోనే కనిపిస్తుందిట
By: Tupaki Desk | 26 Dec 2015 5:42 AM GMTస్వీటీ అనుష్క ఇటీవలి కాలంలో డిఫరెంట్ జోనర్ సినిమాల్ని ఎటెంప్ట్ చేసింది. రుద్రమదేవి 3డిలో వారియర్ క్వీన్ గా నటించి టైటిల్ రోల్ కి ప్రాణం పోసింది. బాహుబలి మూవీలో దేవసేనగా భళ్లాలదేవునిపై పగతో రగిలిపోయే పాత్రలో కనిపించింది. సైజ్ జీరో మూవీలో లావుపాటి అమ్మాయిగా కనిపించి షాకిచ్చింది. ఇలాంటి వైవిధ్యం వేరే నాయికలకు సాధ్యం కాదన్న విశ్లేషణలు వెలువడ్డాయ్. ఇప్పుడు వీటన్నిటికీ పూర్తి డిఫరెంట్ గా కనిపించే రోల్ లో కనిపించబోతోంది స్వీటీ.
ప్రస్తుతం స్వీటీ ఏకకాలంలో రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి -2 లో స్వీటీని రొమాంటిక్ రాణీగా చూడబోతున్నాం. అలాగే అంతకుమించి సింగం -3లో డిఫరెంట్ రోల్ ఎటెంప్ట్ చేస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉంది. సూర్య సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే స్వీటీ ఈ మూవీ ఆద్యంతం కేవలం చీరల్లో మాత్రమే కనిపిస్తుందిట. భర్తకు అండగా నిలిచే భార్యగా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. సింగం-1లో సూర్యని లవ్వాడే చిలిపి పిల్లగా కనిపించింది. ఆ తర్వాత సింగం -2లో అతడిని పెళ్లాడే పిల్లగా కనిపించింది. ఇప్పుడు సింగం -3లో బాధ్యతలు తెలిసిన భార్యగా కంటిన్యూషన్ లో కనిపించబోతోంది. అందుకే సినిమా ఆద్యంతం ఎలాంటి అనవసర ఎక్స్ పోజింగ్ లేకుండా చీరల్లోనే కనిపిస్తుందిట. అంటే చీరలోనే సింగారం అంతా ఒలకబోస్తుందని అనుకోవచ్చన్నమాట!