Begin typing your search above and press return to search.
భయంగా ఉందమ్మా అనుష్కా!
By: Tupaki Desk | 26 Aug 2015 11:11 PM GMT‘‘అందం అనేది సైజులో ఉండదు. మనల్ని మనం అంగీకరించడంలోనే అందమంతా దాగుంది’’ అనే క్యాప్షన్ చూపిస్తూ పోజిచ్చింది అనుష్క. తన కొత్త సినిమా ‘సైజ్ జీరో’ ప్రమోషన్ కు సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ఈ పోజిచ్చింది జేజెమ్మ. ఐతే ఈ క్యాప్షన్ చూస్తుంటే సైజ్ జీరో సినిమాకు సంబంధించి చాలా సందేహాలు మొదలవుతున్నాయి. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న అనే కాన్సెప్టులు టాలీవుడ్ కి కొత్తేమీ కాదు.
రెండేళ్ల కిందటే అల్లరి నరేష్ ‘లడ్డూ బాబు’తో ఇలాంటి పాఠమే చెప్పాలని చూసి బోల్తా కొట్టాడు. ‘సైజ్ జీరో’ వినోదాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా అని చెబుతున్నారు కానీ.. ‘లడ్డూబాబు’ కూడా అలాంటి ప్రయత్నమే అన్న సంగతి మరువొద్దు. దీని కంటే ముందు వినాయకుడు, కితకితలు సినిమాలు కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కాయి. అవి రెండూ ప్రేక్షకులకు మంచి వినోదాన్నందించాయి.
ఇక్కడ పైన చెప్పుకున్న సినిమాల విషయంలో లీడ్ క్యారెక్టర్ ను ‘బొండాం’లా చూడ్డానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. రెండు సినిమాల్లో హీరోలు లావుగా కనిపించారు. ‘కితకితలు’లో కమెడియన్ గీతా సింగ్ అలా కనిపించింది కాబట్టి సమస్య లేదు. కానీ అనుష్కను భారీ అవతారంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహాలున్నాయి. వరుసగా లావు పోస్టర్లు విడుదల చేస్తుంటే జనాల నుంచి ఇలాంటి ఫీడ్ బ్యాకే వచ్చినట్లుంది.. తాజాగా అనుష్క మామూలుగా కనిపిస్తున్న పోస్టర్లు వదులుతున్నారు.
ఇక ‘సైజ్ జీరో’ కథ విషయానికొస్తే.. అది రాసింది ప్రకాష్ కోవెలమూడి కాదు. ఆయన భార్య, బాలీవుడ్ సినిమాలకు స్క్రిప్ట్ కన్సల్టంట్ గా పని చేసిన పూనమ్ థిల్లాన్. బహుశా ఆ అమ్మాయికి తెలుగు సినిమాల గురించి అవగాహన లేదేమో. ప్రకాష్ కూడా తెలుగు సినిమాల్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడు. అందుకే గుడ్డిగా తమ కథతో ముందుకెళ్లిపోతున్నారేమో. మరి ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.