Begin typing your search above and press return to search.
అనుష్కలో ఈ కొత్త ఛేంజ్ ఏంటో..
By: Tupaki Desk | 17 May 2016 9:37 AM GMTఅనుష్క పుట్టింది పెరిగింది బెంగళూరులోనే అయినా.. టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాక తెలుగమ్మాయి అయిపోయింది. పుష్కర కాలం నుంచి ఆమె ఇక్కడే సెటిలైపోయింది. ఇక్కడమ్మాయిలాగే చలామణి అయిపోయింది. ఇండస్ట్రీలో అనుష్కను తమ సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా చూసే ప్రముఖులు చాలా మంది ఉన్నారు.
ఐతే బెంగళూరులో అనుష్కకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్న సంగతి మన ఆలోచనల్లోకే రాదు. ఐతే ఏడాదికోసారైనా బెంగళూరుకు వెళ్లి తన బిగ్ ఫ్యామిలీతో గడిపి వస్తుంటుంది అనుష్క. తన కుటుంబ సభ్యుల ఫొటోలో మీడియాలో రావడానికి మాత్రం అనుష్క ఇష్టపడదు. వాటిని సోషల్ మీడియాలో కూడా పెద్దగా షేర్ చేయదు.
ఐతే ఈ మధ్య అనుష్కలో మార్పు వచ్చేసినట్లుంది. ‘సైజ్ జీరో’ కోసం పెంచిన బాడీని తగ్గించుకునే క్రమంలో గత ఐదారు నెలలుగా మీడియాలో కనిపించకుండా ఉన్న అనుష్క.. రెండు రోజుల కిందట బెంగళూరులో తన అన్నయ్యతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా తన అన్నయ్యతో పాటు అమ్మానాన్నలు.. కజిన్.. ఇంకా బంధువులు ఒక్కొక్కరితో కలిసి సెల్ఫీలు దిగి అన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో అనుష్క చిత్ర విచిత్రమైన హావభావాలు కూడా ఇచ్చింది. ఎప్పుడూ ఫొటోల్లో చాలా సీరియస్ గా ఉండే అనుష్క ఇలా సరదాగా సెల్ఫీలు దిగడం.. వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం చూసి అనుష్కలో ఇంత మార్పేంటేమిటబ్బా అనుకుంటున్నారు అభిమానులు.