Begin typing your search above and press return to search.
6400 అడుగుల ఎత్తులో `విరుష్క`కు ఆంజనేయుని ఆశీస్సులు
By: Tupaki Desk | 20 Nov 2022 11:30 AM GMTఅనుష్క శర్మ - విరాట్ కోహ్లి జంట అన్యోన్యత.. లైఫ్ గోల్స్ గురించి అభిమానుల్లో నిరంతర చర్చ సాగుతుంటుంది. ఈ జంట నేటితరానికి గొప్ప స్ఫూర్తి. కెరీర్ పోరులో ఒకరి జయాపజయాల్లో ఒకరికొకరుగా సాన్నిహిత్యంతో ఓదార్పును అందించి కలిసిమెలిసి మెలగడమెలానో ఈ జంట అందరికీ నేర్పిస్తోంది.
విరుష్క జంట విహార యాత్రలు స్ఫూర్తి దాయకం. ఇప్పుడు అలాంటి ఒక యాత్ర నుంచి విరుష్క ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. దాదాపు సముద్ర మట్టానికి 6400 అడుగుల ఎత్తున ఉన్న ఉత్తరాఖండ్ లోని ఎత్తైన పర్వతాల్లో ఒక దేవాలయంలో ఆశీర్వాదం కోసం కుమార్తె వామికతో కలిసి వెళ్లారు. అక్కడ గడ్డ కట్టే చలిలో ఆంజనేయ స్వామి ఆశీస్సులు కోరుతూ సంతోషంగా చిరునవ్వులు చిందిస్తోంది ఈ జంట.
అభిమానులతో ఫోటోషూట్లు..
అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ ఇటీవల తమ కుమార్తె వామికతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లారు. ఇప్పుడు ఈ జంట అభిమానులతో కలిసి దిగిన ఫోటో ఆన్ లైన్ లో వచ్చింది. ఇందులో తమ గారాల పట్టీ వామికకు చలితో సమస్య లేకుండా తనకోసం ప్రత్యేక లాంజ్ ని ఏర్పాటు చేసారట. ఉత్తరాఖండ్ నైనిటాల్ లోని హనుమాన్ గర్హి అనే ఆలయంలో హనుమంతుని ఆశీస్సులను ఈ జంట తీసుకుంది. ఇక తిరిగి వచ్చేప్పుడు అనుష్క - విరాట్ మార్గంలో ఉత్సాహంగా ఉన్న అభిమానులతో సంతోషంగా పోజులిచ్చారు. ఫోటోలో విరాట్ నల్లని స్వెట్ షర్ట్ ధరించి కనిపించగా.. అనుష్క చలికాలానికి తగ్గట్టు జాకెట్లు కోట్లు మఫ్లర్లతో కనిపించింది. అయితే వారి కూతురు వామిక మాత్రం ఫోటోలో మిస్సవ్వడంతో తనని ఆరుబయట తిప్పకుండా ఎంతో జాగ్రత్తగా చలి లేని ప్రదేశంలో ఉంచారని అర్థమవుతోంది. ఆంజనేయ గర్హి ఆలయం దాదాపు 6400 అడుగుల ఎత్తులో ఉన్న నైనిటాల్ పర్వతాల్లో కొలువు దీరి ఉంది. ఇక్కడికి ప్రయాణం అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది.
ఈ ప్రయాణానికి ముందు విమానాశ్రయంలో విరుష్క జంట సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తో కలిసి ఫోటో దిగారు. అది అంతర్జాలంలో వైరల్ అయ్యింది. వారితో ఫోటో దిగడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు.
అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ కెరీర్ సంగతులు పరిశీలిస్తే ఆ ఇద్దరూ ఎవరికి వారు బిజీ బిజీ. అనుష్క చివరిసారిగా 2018 చిత్రం `జీరో`లో కనిపించింది. షారుఖ్ ఖాన్- కత్రినా కైఫ్ లతో కలిసి ఈ చిత్రంలో నటించారు. ఆ తర్వాత నిర్మాతగా అనేక హిట్ సినిమాలకు అనుష్క సమర్పకురాలిగా వ్యవహరించింది. ఇప్పుడు అనుష్క నటిగా తన చిత్రం `చక్దా ఎక్స్ ప్రెస్`తో తిరిగి బరిలో దిగేందుకు సిద్ధంగా ఉంది. ఇది భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా స్పోర్ట్స్ బయోపిక్ కేటగిరీలో తెరకెక్కుతోంది. దీనిని నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ చేస్తారు. మరోవైపు ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో ఆడిన విరాట్ ఇటీవలే ముంబైకి తిరిగొచ్చాడు.