Begin typing your search above and press return to search.
కారడవిలో ఈ పయనం ఏమిటో..
By: Tupaki Desk | 5 Feb 2019 10:22 AM GMTటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట ప్రస్తుతం న్యూజిల్యాండ్ అడవుల్లో - కొండ కోనల్లో ట్రెక్కింగ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. స్పాట్ నుంచి కొన్ని ఫోటోల్ని విరాట్ - అనుష్క జంట అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఎప్పటికప్పుడు యూత్ లో జోరుగా వైరల్ అయిపోతున్నాయి. తాజాగా అనుష్కతో అడవిలో సంచరిస్తున్న ఓ ఫోటోని విరాట్ షేర్ చేశాడు. ఈ ఫోటోకి అభిమానుల కామెంట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఆదర్శ జంట ఇలా అడవుల్లో షికార్లకు వెళ్లడం చాలా బావుంది అని కొందరు కామెంట్ చేస్తే... జరుగుతున్న అన్ని మ్యాచ్ లలో మిమ్మిల్ని మిస్సవుతున్నాం అని కొందరు అభిమానులు విరాట్ ని ఉద్ధేశించి కామెంట్ చేశారు. ఓ అభిమాని మాత్రం `జంగల్ మే మంగళ్` అంటూ స్పందించాడు. ఆ ఫోటోలో వెనక్కి తిరిగి చూస్తూ నవ్వేస్తున్న అనుష్క శర్మను ఉద్ధేశించి అభిమాని ఆసక్తికర వ్యాఖ్యను చేశాడు. అయితే ఆస్ట్రేలియాపై టీమిండియాని గెలిపించిన ఏకైక కెప్టెన్ గా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న కోహ్లీ ఈ ఉత్సాహంలో ఇలా న్యూజిల్యాండ్ ట్రిప్ ని బ్రిలియంట్ గా ప్లాన్ చేశాడన్నమాట. అక్కడా టీమిండియా గెలుపు నల్లేరుపై నడకలా సాగడంతో ఆ ఉత్సాహం డబుల్ అయ్యిందని అర్థమవుతోంది.
ఇక న్యూజిల్యాండ్ ట్రిప్ ముగించుకుని వచ్చాక అనుష్క శర్మ సంగతేంటి? అని ప్రశ్నిస్తే.. తను పూర్తిగా తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించనుందిట. ఇటీవలే `జీరో` రిలీజై ఫ్లాపైంది. అయితే సంజు - పారి - సుయ్ ధాగ చిత్రాలతో విజయాలు అందుకుంది. 2019లో మరిన్ని చిత్రాలకు కమిటయ్యే ముందే గుడ్ న్యూస్ చెబుతుందేమో! అంటూ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.