Begin typing your search above and press return to search.

డెహ్రాడూన్ లో ప్రేమజంట... గాసిప్స్ కూడా!

By:  Tupaki Desk   |   29 Dec 2016 12:08 PM GMT
డెహ్రాడూన్ లో ప్రేమజంట... గాసిప్స్ కూడా!
X
మోస్ట్ పాపులర్ సెలబ్రెటీ ప్రేమ జంట విరాట్ - అనుష్క లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. స్టేడియంలో సెంచరీ చేసిన తర్వాత ఫ్లైయ్యింగ్ కిస్ లతో ప్రేమను వ్యక్తపరిచే స్థాయిలో విరాట్ అనుష్కను ప్రేమించగా, విరాటే నా సర్వం అని అనుష్క ఇప్పటికే చాలా సార్లు అనేక షో లలో చెప్పింది!! ఆ సంగతులు అలా ఉంటే 2017 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబొతున్న సంబరాలను టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ తో కలిసి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ప్రేమికులు కదా ప్రతీ సందర్భాన్ని ని ఒక స్వీట్ మెమరీగా జరుపుకునే క్రమంలో ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉండటానికి ప్రయత్నిస్తుంటారు! ఈ క్రమంలో వీరిద్దరూ సీక్రెట్ గా డెహ్రాడూన్ కి వెళ్లి సంబరాలు చేసుకోనున్నారన్నమాట! ఆ సంగతులు అలా ఉంటే... ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఈ జంట మరో అడుగు ముందుకు వెయ్యబోతుందని గాసిప్స్ వస్తున్నాయి.

అవును... గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట, మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే ఈ సారి డెహ్రాడూన్ ప్లాన్ చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. 2017లో జీవితంలో స్థిరపడాలని భావిస్తున్న విరాట్ - అనుష్కలు.. కొత్త ఏడాది ఆరంభపు కానుకగా నిశ్చితార్థాన్ని చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారట. దీనికోసం ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్ లోని హోటల్ ఆనందాని వేదికగా చేసుకున్నారని, ఈ కార్యక్రమానికి అనుష్క శర్మ తరపున కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరుకాబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ విరాట్ కోహ్లి కానీ, అనుష్క శర్మ కానీ వారి తరుపున ఎవరూ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

కాగా... తాజాగా విరాట్ - అనుష్క జోడీ ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో విహరిస్తుండగా ఒక వీరాభిమానికి కనిపించారు. ఈ సందర్భంగా ఓ గుడి పూజారి వద్ద ఈ ఇద్దరు ఆశీస్సులు తీసుకుంటుండగా అభిమాని ఒకరు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో ఎక్కడ, ఏ సందర్భంలో తీశారనే వివరాలు కచ్చితంగా తెలియకపోయినా.. కొత్త సంవత్సరం వేడుకల్ని విరాట్‌-అనుష్క జంట కలిసి జరుపుకోబోతున్నదనేది ఈ ఫొటో ద్వారా స్పష్టమవుతోందనే చెప్పాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/