Begin typing your search above and press return to search.

నిన్ను నాకు ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్‌

By:  Tupaki Desk   |   9 Jan 2023 4:30 PM GMT
నిన్ను నాకు ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్‌
X
టీం ఇండియా స్టార్‌ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆటకు విరామం ఇచ్చి ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ లో ఉన్నాడు. భార్య అనుష్క శర్మ మరియు కూతురు వామికతో సాధ్యం అయినంత ఎక్కువ క్వాలిటీ టైమ్ ను విరాట్ కోహ్లీ గడుపుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఆయన షేర్‌ చేస్తున్న ఫొటోలను చూస్తే అర్థం అవుతుంది.

విరాట్ కోహ్లీ బీచ్ లో అనుష్క శర్మ మరియు వామిక తో కలిసి నడుస్తున్న ఒక ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోను వారి వెనుక నుండి తీశారు. విరాట్‌ ఫ్యామిలీ ఫొటో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతుంది.

ఈ పొటోకు విరాట్ కోహ్లీ ఆసక్తికర కామెంట్‌ చేశాడు. దేవుడు నాకు నిన్ను ఇచ్చాడు. నేను ఇంకేమి అడగను.. థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను అంతే అంటూ తన కూతురుపై ఉన్న అమితమైన ప్రేమను విరాట్ కోహ్లీ తన యొక్క కామెంట్‌ రూపంలో చెప్పుకొచ్చాడు.

ఒక వైపు విరాట్‌ కోహ్లీ ఆటతో బిజీగా ఉంటున్నాడు.. మరో వైపు అనుష్క సినిమాలతో బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు వారికి ఇలాంటి హాలీడే లభిస్తుంది. ఆ హాలీడే ను సాధ్యం అయినంత ఎక్కువగా వామికతో గడుపుతూ తమ ఆనందాన్ని పాపతో షేర్‌ చేసుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.