Begin typing your search above and press return to search.

అనుష్క ఎమోషనల్‌ పోస్ట్‌.. తప్పదంటున్న కోహ్లీ ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   18 Feb 2020 9:30 AM GMT
అనుష్క ఎమోషనల్‌ పోస్ట్‌.. తప్పదంటున్న కోహ్లీ ఫ్యాన్స్‌
X
టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు జోడీకి ఏ స్థాయిలో అభిమానులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో వీరి ఫొటోలు.. పోస్ట్‌ లు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. వీరిద్దరు ఒకరి గురించి ఒకరు పెట్టే పోస్ట్‌ లు ఫొటోలు మరీ ఎక్కువ వైరల్‌ అవుతాయి. తాజాగా అనుష్క పెట్టిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం టీం ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో ఇప్పటికే టీ20 మరియు వన్డే సిరీస్‌ లు పూర్తి చేసుకున్నారు. వన్డే సిరీస్‌ పూర్తి అయిన తర్వాత కాస్త గ్యాప్‌ దొరకడంతో కుటుంబ సభ్యులతో టీం ఇండియా సభ్యులు న్యూజిలాండ్‌ లో విహార యాత్ర చేశారు. కోహ్లీతో పాటు అనుష్క కూడా ఉంది. విహారయాత్రకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది. ఇక టెస్టు సిరీస్‌ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో ఆటగాళ్లు మళ్లీ ప్రాక్టీస్‌ లో నిమగ్నం అయ్యారు. అదే సమయంలో అనుష్క షూటింగ్‌ నిమిత్తం ఇండియా వచ్చేయాలి.

విరాట్‌ కోహ్లీకి బై చెప్పి రావడం చాలా కష్టం అనిపించిందంటూ ఎమోషనల్‌ గా పోస్ట్‌ పెట్టింది. మన వారికి బై చెప్పడం ఈజీ అనుకుంటారు. కాని అది ఎంత కష్టమో కొందరికే తెలుసు అంది. కోహ్లీని వదిలి ఉండలేక అనుష్క విరహ వేదన పడుతున్నట్లుగా పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం కోహ్లీ విజయాలు సాధించాలంటే.. టీం ఇండియా టెస్టుల్లో గెలవాలంటే తప్పదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి విరుష్కల విరహ వేదన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.