Begin typing your search above and press return to search.
సునీల్ గవాస్కర్ అసహ్య వ్యాఖ్యానం .. అనుష్క శర్మ ఫైర్!
By: Tupaki Desk | 25 Sep 2020 3:30 PM GMTలెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ‘అసహ్యకరమైన వ్యాఖ్య చేశారు` అంటూ అనుష్క శర్మ తీవ్ర స్వరంతో కౌంటర్ వేశారు. తన భర్త కోహ్లీ ఆటతీరుపై ఆయన కామెంట్ చేస్తూ ఇందులోకి గర్భవతి అయిన తనను లాగడంపై ఒక రేంజులోనే ఫైరయ్యారు అనుష్క. మీకు నన్ను నా భర్తను గౌరవించరా? అంటూ ప్రశ్నించారు అనుష్క శర్మ.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో గవాస్కర్ కామెంట్ ట్రెండింగ్ లో ఉంది. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా ఈ వివాదం వేడెక్కించింది. విరాట్ కోహ్లీ ఎందుకనో ఆటలో అంచనాలను అందుకోలేక పోవడంతో వ్యాఖ్యాత గా గవాస్కర్ చేయకూడని కామెంట్ చేశారని నెటిజనులు అంటున్నారు. విరాట్ - అనుష్కలతో సంబంధం లేకుండా అవాంఛనీయమైన వ్యాఖ్య చేశారన్న ఆరోపణలు కొందరు నెటిజనులు చేశారు.
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి వైఫల్యంపై సునీల్ గావస్కర్ చేసిన కామెంట్ దుమారమే రేపుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున అనుష్క ఓ రేంజులోనే ఫైరైంది. ``భర్త ఆటకు భార్యపై ఆరోపణలు చేస్తారా? ఆడాళ్లను గౌరవించరా?` అంటూ అనుష్క ప్రశ్నించారు. చాలా కాలంగా క్రికెట్ కామెంట్రీ చెబుతున్న మీరు... ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించరా? నా భర్త ఆటతీరుపై ఇంకా ఏవేవో అనాలనుకుంటున్నారని నాకు తెలుసు. ఇందులోకి నన్ను లాగి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారా? గౌరవనీయులైన మీరు చేయాల్సిన పనేనా? బాధ కలిగింది. అందుకే చెబుతున్నా.. అని అనుష్క ఆవేదనను వ్యక్తం చేసింది. మిస్టర్ గవాస్కర్, మీ సందేశం అసహ్యకరమైనది అంటూ తీవ్ర పదజాలం అనుష్క ఉపయోగించడం చర్చనీయాంశమైంది. నెటిజనుల్లో ఒక సెక్షన్ కోహ్లీని తిడుతున్నా.. ఒక సెక్షన్ మాత్రం అనుష్క శర్మను సమర్థించారు.