Begin typing your search above and press return to search.
అనుష్కపై బ్యాన్? పనీ పాటా లేదసలు
By: Tupaki Desk | 27 Oct 2015 5:36 AM GMTఆదివారం నాడు ఇండియా-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్ చూస్తున్న వాళ్లకు ఒకటే సర్ ప్రైజ్. సౌతాఫ్రికా వీరబాదుడికి కన్నీరు కార్చని భారతీయుడు లేడంటే ఒట్టు. ఒక్క ఇన్నింగ్సులో 437 పరుగుల వీరబాదుడు చూసి జనాల గుండెలు అవిసిపోయాయి. అయితే ఇలాంటి మ్యాచ్ లో కనీసం విరోచిత పోరాటం కనబరిచి చేతులెత్తేస్తే అది జనాలకు కనీసం విందు, పసందు పంచి ఉండేదే. అయితే ఇండియన్ టీమ్ మాత్రం ఇట్టే చేతులెత్తేసింది.
ముఖ్యంగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పెర్ఫామెన్స్ చిత్తడి చిత్తడి చేసేసింది. వైడ్ వెళుతున్న బంతిని కెలికి పేలవమైన షాట్ కొట్టబోయిన ఫలితం అతడిని పెవిలియన్ దరికి చేర్చింది. కట్ చేస్తే.. అతడు ఔట్ అవ్వడానికి మూడు బంతుల ముందు... ప్రత్యర్థి బౌలర్ 160 కి.మీ.ల వేగంతో అదరగొట్టేసే బంతులు విసురుతున్నాడు. ఇక ఇదే సరైన టైమ్. అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టే షాట్ కొట్టాలి అనుకున్నాడు కోహ్లీ. ఇంకేం ఉంది. మిడ్ వికెట్ మీదుగా దూసుకొస్తున్న బంతిని వీరబాదుడు బాదాడు. బంతి బౌండరీ దాటి గ్యాలరీలో పడింది. అంపైర్ సిక్సర్ అంటూ నమోదు చేశాడు. ఇంకేం ఉంది అప్పటికే స్టేడియంలో ఆడియెన్ మధ్య కూచుని మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేయసి అనుష్క శర్మ ముఖం లో మతాబులు వెలిగిపోయాయి. ఎగిరి గంతులేసేసింది. ముఖాన్ని కప్పుకుని ప్రియుడి వీరత్వాన్ని తనివితీరా అనుభవించి, ఫలవరించింది. మరో బంతి.. దూసుకొచ్చింది.. ఆఫ్ సైడ్ లో దూరంగా పడిన బంతిని మనోడు కెలికి పడేశాడు. ఆ బంతిని ఆడడంలో కాస్త ఆవేశం ప్రదర్శించాడు కుర్రాడు. టెంప్ట్ అయిపోయాడు. ఇంకేముంది ఖేల్ కతమ్ దుఖాన్ బంద్.
బంతి వెళ్లి వికెట్ కీపర్ చేతిలో పడింది. ఆ క్షణం అనుష్క ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ చూడాలి. నిర్ఘాంతపోయింది. ఇది ఊహించనిది. షాక్ పుట్టించేది. ప్రియుడు ఇరగదీసేస్తాడు అనుకుంటే .. మరోసారి ప్రపంచకప్ ఫైనల్ ని గుర్తు చేశాడు. అందుకే ఇప్పుడు జనాల డిమాండ్ ఒక్కటే .. అనుష్క శర్మని బహిష్కరించండి. మ్యాచ్ లకు రానివ్వద్దు అంటున్నారు జనాలు. అర్ధముందా ఈ డిమాండ్ లో అసలు? అనుష్క వస్తే ఏంటి రాకపోతే ఏంటి.. మనోడు సరిగ్గా ఆడాలి కాని.. ఇంకా నయం కొత్తగా పెళ్ళయిన రైనా వైఫ్ ను.. అలాగే ఇతర క్రికెటర్ల వైఫ్ ను బ్యాన్ చేయాలని చెప్పలేదు. ఏదో ఈమె ఒక స్టార్ హీరోయిన్ కాబట్టి.. ఇలా మనోళ్ళకు సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. పనీ పాటా లేనోళ్ళే ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని అనుకోవచ్చు.