Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తన హీరోకి ముద్దిచ్చింది

By:  Tupaki Desk   |   12 March 2018 5:43 AM GMT
ఫోటో స్టోరి: తన హీరోకి ముద్దిచ్చింది
X

టాప్ సెలబ్రెటీలు సాధారణంగా లవ్ లో ఉంటేనే ఫొటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతాయి. ఆ పోటోలను వారు బయటపెట్టాలని అనుకోరు ఎప్పుడైనా లీక్ అవుతేనే ట్రెండ్ అవుతుంటాయి. ఆ తరువాత నెగిటివ్ కామెంట్స్ వైరల్ న్యూస్ లు చాలానే వస్తాయి. అదే పెళ్లి జరిగి స్టిల్స్ ఇస్తే..ఇంకేముంది అవి కూడా మరో రేంజ్ లో చాలా పాజిటివ్ గా వైరల్ అవుతాయి. ప్రస్తుతం విరాట్ అనుష్క ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఇక అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా అనుష్క సినిమాలో హీరోయిన్ లాగా తన రియల్ హీరోకి ముద్దు పెట్టేసింది. దీంతో ఈ స్టిల్ ఎదో బావుందే అని విరాట్ సెల్ఫీ తీసేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫొటోకి లక్షల్లో లైకులు వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. మొదట అనుష్క ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా గంటలోనే ఏడూ లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆ తరువాత విరాట్ కూడా ఫొటోను షేర్ చేయడంతో 12 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

అలాగే నెటీజన్స్ చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి అని ఓ రేంజ్ లో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మరికొందరు బెస్ట్ కపుల్స్.. లవ్లీ పిక్ అని క్యూట్ గా ట్యాగ్స్ ఇచ్చేస్తున్నారు. ఇకపోతే ఈ జంటకు చాలా రోజుల తరువాత హాలిడేస్ దొరికాయి. ఇద్దరు వారి ప్రొఫెషనల్ పనులతో బిజీగా ఉండడం వల్ల ఇన్ని రోజులు కలుసుకోలేకపోయారు. ఇక అనుష్క రీసెంట్ ఫిల్మ్ పారి అనుకుంన్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.