Begin typing your search above and press return to search.
పిక్ టాక్: డెలివరీ అయిన రెండు నెలల్లోనే ఇంత ఫిట్ గా ఎలా..?
By: Tupaki Desk | 31 March 2021 1:33 PM GMTటీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ.. జనవరి నెలలో ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా తన గారాలపట్టిని చూసుకుంటూ గడిపిన అనుష్క.. ఇప్పుడు మళ్ళీ వర్క్ లో అడుగుపెట్టింది. ఆమె సైన్ చేసిన బ్రాండ్ ఎండార్స్మెంట్ షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనుష్క రెండు రోజుల పాటు బ్యాక్-టు-బ్యాక్ వాణిజ్య ప్రకటన షూటింగులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క శర్మ వర్క్ లోకి వచ్చిన ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇందులో వైట్ టాప్ మరియు బ్లూ డెనిమ్ ధరించిన అనుష్క ముఖానికి మాస్క్ పెట్టుకొని ఉంది. దీంట్లో అనుష్కను చూసిన అభిమానులు ఒకింత షాక్ కు గురవుతున్నారు. ప్రసవం తర్వాత ఇంత త్వరగా ఇంత ఫిట్ గా కనిపించడం ఆమెకు ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 'రబ్ నే బనాదీ జోడి' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అనుష్క శర్మ.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసింది. చివరిగా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమా నిర్మాణంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన అనుష్క.. హీరోయిన్ గా మరో సినిమాని ప్రకటించలేదు.