Begin typing your search above and press return to search.

అచ్చంగా అనుష్క‌లా ఉందే!

By:  Tupaki Desk   |   6 Feb 2019 7:08 AM GMT
అచ్చంగా అనుష్క‌లా ఉందే!
X
మ‌నిషిని పోలిన మ‌నుషులు ప్ర‌పంచంలో ఏడుగురు ఉంటార‌ని చెబుతారు. ఏడుగురు ఒక‌రికొక‌రు ఎదురు ప‌డ‌తారో లేదో తెలీదు కానీ, ఓ ఇద్ద‌రు మాత్రం ఏదో ఒక సంద‌ర్భంలో క‌లిసే ఛాన్స్ లేక‌పోలేదు. ఈ త‌ర‌హాలో పోలిక‌లు ఉన్నాయంటూ ఫోటోల ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్ప‌టికే ఎంద‌రో సెల‌బ్రిటీలు ట్విన్ లుక్ తో ఫోటోలు అంత‌ర్జాలంలో అందుబాటులోకి వ‌చ్చాయి. ఆ ఇద్ద‌రి పోలిక‌ల్ని చూసుకుని మురిసిపోవ‌డం అభిమానుల వంతు అవుతోంది.

ఇదివ‌ర‌కూ `ప్రేమంటే ఇదేరా` చిత్రంలో `నైజాం భామ‌లు నాటు బాంబులు..` సాంగ్ లో షారూక్ ని పోలిన షారూక్ స్టెప్పులేస్తుంటే అరే.. అచ్చం అలాగే ఉన్నాడే! అంటూ ఆశ్చ‌ర్య‌పోయారంతా. అలాగే హృతిక్ రోష‌న్ ని పోలిన హృతిక్ గా పాపుల‌ర‌య్యాడు వేరొక హీరో. ఐశ్వ‌ర్యారాయ్ ని పోలిన లుక్ తో ఉన్న‌ స్నేహా ఉల్లాల్ ని చూసి స‌ల్మాన్ సినిమాలో ఛాన్సిచ్చాడు. ఆ త‌ర్వాత ఉల్లాల్ బోయ్స్ గుండెల్లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది. ఇక క‌త్రిన‌ను పోలిన జ‌రైన్ ఖాన్ ని స‌ల్మాన్ భాయ్ వెండితెర‌కు ప‌రిచ‌యం చేశాడు.

అది గ‌తం అనుకుంటే.. ఇటీవ‌లే స‌మంత‌ను పోలిన వేరొక స‌మంత (అన్షుల‌) ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. ఆ ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. డ‌బ్ స్మాష్ లు వ‌గైరా వైర‌ల్ అయ్యాయి. ఇక విరాట్ కోహ్లీని పోలిన కోహ్లీ ఫోటోలు ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో ప్రాచుర్యం పొందాయి. ఆర్జీవీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కోసం అచ్చం ఎన్టీఆర్ ని పోలిన వేరొక ఆర్టిస్టును వెతికి ప‌ట్టుకున్నారు. ఇక చిరంజీవి, బాల‌కృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ల‌కు డూప్ లు ఎంద‌రో వ‌చ్చారు. వీళ్ల సినిమాలు కూడా ఆడాయి. ప్ర‌స్తుతం చిరంజీవి, బాల‌కృష్ణ ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్టుతో టాలీవుడ్ లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ న‌టుల్ని కూడా ఎంపిక చేసి రామానాయుడులో సినిమాని ప్రారంభించారు ఇదివ‌ర‌కూ.

ఇదంతా స‌రే.. లేటెస్టుగా విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌ను పోలిన వేరొక అమ్మ‌డు నెట్‌లో ప్ర‌కంప‌నాల‌కు తావిస్తోంది. చూడ‌టానికి అచ్చం అనుష్క శ‌ర్మ‌ను పోలి ఉన్న ఈ అమ్మ‌డు పాపుల‌ర్ అమెరిక‌న్ సింగ‌ర్ జులియా మైకేల్స్. ప్ర‌స్తుతం అనుష్క - జులియా మైకేల్స్ ఫోటోల్ని ఎటాచ్ చేసి అభిమానులు అంత‌ర్జాలంలో వైర‌ల్ చేస్తున్నారు. ఈ ఫోటో అటూ ఇటూ తిరుగుతూ టాలీవుడ్ మీడియా కంట ప‌డింది. ఒక్క హెయిర్ క‌ల‌ర్ మిన‌హా ముక్కు, మూతి, క‌ళ్లు, ఇత‌ర‌త్రా.. అనుష్క శ‌ర్మ‌నే త‌ల‌పిస్తోంది జులియా.