Begin typing your search above and press return to search.

ఆవిడ పెళ్లాడితే ఈవిడ‌కు ఏడుపు

By:  Tupaki Desk   |   31 Dec 2018 9:43 AM GMT
ఆవిడ పెళ్లాడితే ఈవిడ‌కు ఏడుపు
X
క‌థానాయిక‌ల మ‌ధ్య క్యాట్ ఫైట్ స‌హ‌జ‌మే. ఆ మాట‌కొస్తే క‌పూర్ గాళ్ సోన‌మ్ ప‌లువురు క‌థానాయిక‌ల‌తో గొడ‌వ‌లు ప‌డిన సంద‌ర్భాలున్నాయి. ప‌లువురు సీనియ‌ర్ నాయిక‌ల‌పైనా కామెంట్లు చేసి అడ్డంగా బుక్కయ్యింది. తాజాగా ఈ బ్యూటీ `కాఫీ విత్ క‌ర‌ణ్` షోలో త‌న కొలీగ్ పై ఓ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేసింది.

``ఆ పెళ్లి కూతురు అందంగా ఉంది అని చెప్ప‌ను కానీ` అంటూనే.. అనుష్క శ‌ర్మ పెళ్లి చూసాక ఏడ్చేశాను.. నేను చూసిన అరుదైన‌ పెళ్లిళ్ల‌లో అది ఒక‌టి.. అంటూ వ్యాఖ్యానించింది. సోన‌మ్ ఇండ‌స్ట్రీలో త‌క్కువ‌మందితో స్నేహంగా ఉంటుంది. త‌న‌కు న‌చ్చే - ఎంతో స‌న్నిహితురాలైన‌ అనుష్క శ‌ర్మ‌ పెళ్లి గురించి అందుకే ఈ షోలో ప్ర‌స్థావించింది అందుకే. అయినా ఆవిడ పెళ్లాడితే ఈవిడ‌కెందుకు ఏడుపు? ఇక సోన‌మ్ తో పాటు త‌న సోద‌రి రియా క‌పూర్ - సోద‌రుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ `కాఫీ విత్ క‌ర‌ణ్` షోలో పాల్గొని చాలా సంగ‌తుల్నే ముచ్చ‌టించారు.

క‌పూర్ కుటుంబం గురించిన ప‌ర్స‌న‌ల్ విష‌యాల్ని సోన‌మ్ ముచ్చ‌టించింది. క‌రణ్ వారం వారం సీజ‌న్ 6ని వేడెక్కిస్తూనే ఉన్నాడు. గ‌త ఆదివారం బాహుబ‌లి త్ర‌యం ప్ర‌భాస్ - రానా- రాజ‌మౌళితో స్పెష‌ల్ ఎపిసోడ్ అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ - రానా పెళ్లి గుట్టు పైనా క‌ర‌ణ్ ప్ర‌శ్నించ‌డంతో అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.