Begin typing your search above and press return to search.

పవన్‌కల్యాణ్‌ కంటే వెనకబడిందే

By:  Tupaki Desk   |   1 July 2015 7:22 AM GMT
పవన్‌కల్యాణ్‌ కంటే వెనకబడిందే
X
క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్మే హీరో పవన్‌కల్యాణ్‌. అందుకే అతడు ఇన్నేళ్లలో నటించింది కేవలం 21 సినిమాల్లో మాత్రమే. అదే తీరుగా బాలీవుడ్‌లోనూ ఓ కథానాయిక పవన్‌నే ఫాలో అయిపోతున్నట్టుంది. 7 సంవత్సరాల్లో కేవలం 8 సినిమాలు మాత్రమే చేసి రికార్డు బద్ధలు కొట్టింది. ఇదంతా రబ్‌ నే బనాదీ జోడీ ఫేం అనుష్క శర్మ గురించే.

సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ స్టార్‌డమ్‌ని పెంచుకుంటున్న కథానాయికగా ఈ అమ్మడికి పేరుంది. ఇటీవలే ఎన్‌హెచ్‌ 10తో నిర్మాతగానూ కొత్త అవతారం ఎత్తింది. అటు కథానాయకగా, ఇటు నిర్మాతగా సక్సెసైంది. కెరీర్‌ వేగం పెంచడంలో ఇంతకాలం వెనకబడ్డామని భావించిందో ఏమో, ఇటీవలి కాలంలో దూకుడు పెంచింది. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాల్లో నటించేసింది. 2015 ప్రథమార్థంలో రిలీజైన ఎన్‌హెచ్‌ 10, దిల్‌ దడ్కనే దో, బాంబే వెల్వెట్‌ చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో తనే స్వయంగా నిర్మించి నటించిన 'ఎన్‌హెచ్‌ 10' మాత్రమే పెద్ద సక్సెసైంది. ఈ సినిమా 13కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 32కోట్లు వసూలు చేసింది. ఓ చిన్న సినిమా సాధించిన భారీ విజయమిది.

ఈ మధ్యనే అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన బాంబే వెల్వెట్‌లో రోజీ అనే జాజ్‌ గాయకురాలిగా నటించి ఆకట్టుకుంది. జోయా అక్తర్‌ రూపొందించిన దిల్‌ దడ్కనే దో చిత్రంలో ప్రియాంక చోప్రా, రణవీర్‌ సింగ్‌, అనీల్‌కపూర్‌ లాంటి స్టార్లతో కలిసి నటించింది. కనిపించింది కొద్ది సేపే అయినా అనుష్క అదరగొట్టేసిందన్న పేరొచ్చింది. ఈమె ఓ బాలీవుడ్‌ పవన్‌ కళ్యాణ్‌ బాబోయ్‌!!