Begin typing your search above and press return to search.

ప్చ్‌! స్టార్ హీరోయిన్ కు భ‌ర్త‌కు దూరంగానే..!!

By:  Tupaki Desk   |   3 July 2020 6:30 AM GMT
ప్చ్‌! స్టార్ హీరోయిన్ కు భ‌ర్త‌కు దూరంగానే..!!
X
`పెళ్లి త‌ర్వాత పాట్లు` అనే పుస్త‌కం రాస్తే అందులో స‌గం పేజీలు జాబ్ స్ట్రెస్.. మోడ్ర‌న్ లైఫ్ స్టైల్ అన్న ప‌దాలే ఉంటాయేమో! ముఖ్యంగా మొగుడు పెళ్లాం విభిన్న రంగాల్లో సెల‌బ్రిటీలు అయితే ఇక వారి క‌ష్టాలకు అంతూ ద‌రీ ఉండ‌దు. పెళ్ల‌య్యాక ఏళ్ల త‌ర‌బ‌డి మేం క‌లిసి లేము! అని డైరెక్టుగా చెప్పేవాళ్లే ఎక్కువ‌. అస‌లు పెళ్లెందుకు చేసుకుంటారు? అన్న‌దానికి ప‌ర‌మార్థం క‌నిపించ‌దు.

`స్టాట‌స్ ని పెంచుకునేందుకు పెళ్లి` అన్న‌దే ఇటీవ‌ల‌ ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఆస్తులు అంత‌స్తుల సంగ‌మం అని డైరెక్టుగానే చూసేవాళ్లు విశ్లేషిస్తుంటారు. ఒక ర‌కంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ చెబుతున్న కొన్ని వాస్త‌వాలు విన్న త‌ర్వాత ఆమాత్రం అవ‌గాహ‌న సామాన్యుడికి అయినా వ‌చ్చేస్తుంది ఈజీగా.

టీమిండియా కెప్టెన్ ని అనుష్క శ‌ర్మ ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అయితే పెళ్లి త‌ర్వాత మొద‌టి ఆరు నెల‌ల్లో కేవ‌లం 21 రోజులు మాత్ర‌మే క‌లిసి గ‌డిపామ‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకు రావ‌డం షాకిచ్చింది. ``నిరంతం వృత్తిప‌ర‌మైన బిజీ జీవితం. రోజులు లెక్కించిన సంద‌ర్భాలున్నాయి`` అంటూ కాస్త నిట్టూర్పు గానే చెప్పుకొచ్చింది ఈ భామ‌.

అయినా త‌ప్ప‌దు మ‌రి. ఆ ఇద్ద‌రి ఉద్యోగాలు అలాంటివి మ‌రి. విరాట్ ఎప్పుడూ విదేశీ టూర్ల‌తో బిజీ బిజీ. అనుష్క శ‌ర్మ బాలీవుడ్ సినిమాల‌తో బిజీ. దీంతో అనుష్క‌ తానే తీరిక చూసుకుని విదేశీ ప్ర‌యాణాల‌కు సిద్ధ‌మ‌వ్వాల్సి వ‌చ్చేది. ఇక ఈ ఇద్ద‌రి డిన్న‌ర్ డేట్లు విదేశాల్లోనే ఎక్కువ‌. స‌రిగ్గా ఇలాంటి విర‌హ కాలంలో ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రికీ మ‌హ‌మ్మారీ బోలెడంత సాయం చేసింద‌ట‌. ఈ లాక్ డౌన్ పీరియ‌డ్ అంతా క‌లిసే ఉన్నారు. గ‌త కాల‌పు అసంతృప్తుల‌న్నిటికీ క్రైసిస్ కాలం అలా చెక్ పెట్టేసిందట‌.