Begin typing your search above and press return to search.

నా భార్య బెస్ట్ మూవీ ఇది

By:  Tupaki Desk   |   2 March 2018 9:44 AM GMT
నా భార్య బెస్ట్ మూవీ ఇది
X
బాలీవుడ్ హార‌ర్ మూవీ ప‌రి. ఈ సినిమా చూసిన వాళ్లు భ‌య‌ప‌డ‌కుండా ధియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ట‌. అనుష్క శ‌ర్మ ద‌య్యం ప‌ట్టిన యువ‌తి పాత్ర‌లో ఇర‌గ‌దీసేసింద‌ట‌. కేవ‌లం ధైర్య వంతులే సినిమా చూడాలంటే కొన్ని రివ్యూలు తేల్చిచెప్పేస్తున్నాయి కూడా. మ‌రి కొత్త పెళ్లి కొడుకు కోహ్లీ సినిమా ఏం ఫీల‌య్యాడో...?

పెళ్ల‌య్యాక అనుష్క చేసిన సినిమా ప‌రి. ఆ సినిమా ట్రైల‌ర్లు... పోస్టర్లు చూసి ఎన్నో జోకులు పేలాయి. ద‌య్యంలా ఉన్న అనుష్క పోస్ట‌ర్లు చూశాక‌... ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లడానికే కోహ్లీ భ‌య‌ప‌డ‌తాడంటూ ఎన్నో కామెడీ పోస్టులు... ఫేస్ బుక్‌లో చ‌క్క‌ర్లు కొట్టాయి. కోహ్లీ మాత్రం ధైర్యంగా సినిమా చూసి త‌న భార్య‌ను తెగ మెచ్చుకుంటున్నాడు. అనుష్క‌తో క‌లిసి గ‌త రాత్రే సినిమా చూశాన‌ని... త‌న భార్య కెరీర్‌ లో బెస్ట్ మూవీల్లో ఇదీ ఒక‌టి అవుతుంద‌ని ట్వీట్ చేశాడు. త‌న భార్య‌ను చూసి గర్వ‌ప‌డుతున్న‌ట్టు చెప్పాడు. సినిమా చూసిన‌ప్పుడు కాస్త భ‌యం వేసింద‌ని ఒప్పుకున్నాడు. పెళ్ల‌యిన కొత్త‌లో ఈ జంట క‌లిసి ఇలాంటి హార‌ర్ సినిమాను చూడాల్సి వ‌చ్చింది.

ముంబైల వేసిన స్ర్కీనింగ్ కు కోహ్లీ... అనుష్క శ‌ర్మ‌... ఆమె కుటుంబ‌స‌భ్యులు... ప‌రి ద‌ర్శ‌కుడు ప్రొసీత్ రాయ్‌... ప‌రిలో క‌థానాయ‌కుడు ప‌రంబ్ర‌తా ఛ‌ట‌ర్జీ కూడా హాజ‌ర‌య్యారు. అన్న‌ట్టు ఈ సినిమా అనుష్కే నిర్మాత కూడా. అయితే ఓవ‌రాల్ చూసుకుంటే సినిమా సూప‌ర్ అన్న‌మాట ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఎక్కువ రివ్యూలు యావ‌రేజ్ రేటింగ్ ఇచ్చాయి.