Begin typing your search above and press return to search.
చైతన్య కంటే కెప్టెనే డేర్ చేశాడే
By: Tupaki Desk | 2 March 2018 11:29 AM GMTటాలీవుడ్‌లో నాగ చైతన్య - సమంత హాట్ కపుల్... అదే బాలీవుడ్‌లో విరాట్ - అనుష్క. ఈ జంటలకు ఒక సారూప్యత ఉంది. వీళ్ల పెళ్లి జరిగాక... వారి భార్యలు చేసిన సినిమాలు రెండూ.. దెయ్యం సినిమాలే. దెయ్యాల రూపంలో భార్యలను చూసిన వీరి ఫీలింగేంటీ? అసలు వీళ్లు ఆ సినిమాలు చూశారా?
సమంత పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమా రాజుగారి గది2. అందులో ఆమె ఆత్మగా కనిపించింది. చైతూ సినిమా విడుదలవ్వక ముందే... ఆ సినిమా తాను చూడడని... తనకు చాలా భయమని చెప్పేశాడు. చెప్పినట్టే ఆ సినిమా అతను చూడలేదు. నిజానికి ఆ సినిమాలో భయపడేంత సీన్లేమీ లేవు. సమంతను కూడా భయంకరంగా ఏమీ చూపించలేదు. అయినా చైతూకి ఉన్న భయంతో ఆ సినిమాను చూడలేదు. పెళ్లిరోజున స్నేహితులంతా బలవంతంగా కూర్చోబెట్టి... రాజు గారి గది 2 ట్రైలర్ మాత్రం చూపించగలిగారు. కనీసం జంగిల్ బుక్ లో పామును చూడడానికి కూడా అతనికి భయమంటా. అదే విరాట్ విషయానికి వస్తే... చైతూ మీద అతను వందరెట్లు ధైర్యవంతుడనే చెప్పాలి
పరి సినిమా ట్రైలర్స్ చూస్తేనే చెమటలు పట్టేస్తున్నాయ్. ఇంకా ఆ సినిమాలో అనుష్క నటన... వేషం... చించేసింది. భయానికే భయం పుట్టేలా ఉందని చెబుతున్నారు సినిమాను చూసినవాళ్లు. అలాంటి సినిమాను తన భార్య కోసం ధైర్యంగానే చూశాడు విరాట్. అనుష్కను చూసి విరాట్ భయపడతాడని అనుకున్నారు. కానీ విరాట్ భయమేసినా కూడా సినిమా చూసేశాడు. రాత్రికి నిద్రపట్టిందో లేదో అతనికే తెలియాలి.