Begin typing your search above and press return to search.

అందం క‌రిగిపోయింద‌ని ద్వేషించుకోలేను

By:  Tupaki Desk   |   13 Nov 2021 5:30 PM GMT
అందం క‌రిగిపోయింద‌ని ద్వేషించుకోలేను
X
విరుష్క జంట ఇటీవ‌ల కాస్తంత స్త‌బ్ధుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట అన్యోన్య‌ జీవితం .. వారి ప్రేమ‌కు గుర్తుగా వామిక జ‌న‌నం అనంత‌రం ఆహ్లాద‌క‌ర‌మైన జీవితాన్ని ఆస్వాధించేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. అయితే మొద‌టి కాన్పు త‌ర్వాత త‌ల్లి శ‌ర‌రీంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మ‌మ్మీ అయ్యాక మునుప‌టిలా అంత అందంగా క‌నిపించే వీల్లేదు అన్న భావ‌న‌ చాలా మందిలో ఉంది. తాజాగా అలాంటి సందేహాల‌పై అనుష్క శ‌ర్మ ఓ మ్యాగ‌జైన్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర సంగ‌తులు వెల్ల‌డించింది.

``నేను కూడా అందం గురించి చాలా ఎక్కువ‌గా ఆలోచించేదాన్ని. కానీ త‌ల్లి అయిన త‌ర్వాత ద‌క్కిన సంతోషం.. ఆనందం కంటే ఏదీ ఎక్కువ కాదు. త‌ల్లి కావ‌డం అనేది ఓ వ‌రం. అలాంటి అవ‌కాశాన్ని ఎవ‌రు వ‌దులుకుంటారు. కానీ ఓవైపు అందం విష‌యంలో భ‌య‌ప‌డేదాన్ని. నాకున్న అల‌వాట్ల కార‌ణంగా త‌ల్లి అయిన త‌ర్వాత‌ మున‌పటి లా అందాన్ని క‌లిగి ఉన్నాను. కానీ టోన్డ్ బాడీలో కొన్ని మార్పులైతే వ‌చ్చాయి. అలాగ‌ని నా శ‌రీరాన్ని నేను ద్వేషించ‌లేను క‌దా? పెళ్లికి ముందు..పెళ్లి త‌ర్వాత‌..బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత ఒకేలా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాను. కానీ దేనికైనా ఒత్తిడి ఒక్క‌టే కార‌ణ‌మ‌వుతుంద‌ని గ్ర‌హించాను. దాన్ని ఎలా అధిగ‌మించాల‌ని..దానికి త‌గ్గ‌ట్టు న‌న్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ త‌ర్వాత నాలో పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌లేదంటే కార‌ణం ఫిట్ నెస్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు వ‌హించ‌డ‌మే. క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయ‌మం చేయ‌డం.. యోగా లాంటివి మ‌నిషిని..మ‌న‌సుని ఎంతో ప్ర‌శాంతంగా ఉంచుతాయ‌``ని అనుష్క శ‌ర్మ అన్నారు.

ఆస్వాధ‌నే జీవిత ప‌ర‌మార్థం

అనుష్క శ‌ర్మ ఇటీవ‌ల సినిమాలతో బిజీ లైఫ్ ని మించి త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆస్వాధించేందుకు ఇష్ట‌ప‌డుతోంది. దుబాయ్ టూర్ స‌హా వ‌ర‌స టీ20ల్లో కోహ్లీ బిజీగా ఉంటే.. తాను కూడా అక్క‌డ ఆట‌ను ఆస్వాధించేందుకు వెళ్లింది. అక్క‌డ టీమిండియా ప్లేయ‌ర్స్ భార్యామ‌ణుల‌తో దిగిపోవ‌డం ఎంజాయ్ చేయ‌డం తెలిసిన‌దే. భ‌ర్త‌లు మ్యాచ్ లు ఆడుతుంటే భార్యామ‌ణ‌లు మాత్రం పిల్ల‌ల్ని వెంట తీసుకుని వెళ్లి దుబాయ్ మొత్తం షికార్లు చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. విరాట్ -అనుష్క శ‌ర్మ‌-బేబి వామిక‌.. రోహిత్ శ‌ర్మ‌-రిషిక స‌జ్దే..న‌ట‌నా స్టాంకోవిచ్..హార్దిక్ పాండ్య‌..అశ్విన్ త‌మ భార్య పిల్ల‌ల‌తో క‌లిసి దుబాయ్ టూర్ బాగా ఆస్వాధించారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలోనే విదేశాల్లో జ‌రిగే `హాలోవీన్` పండుగ కూడా తోడైంది. దీంతో ఆ జంట‌లు పిల్ల‌ల‌తో క‌లిసి ఆ వేడుక‌ల్ని కూడా సెల‌బ్రేట్ చేసుకున్నారు.