Begin typing your search above and press return to search.

విరాట్ కోసం అనుష్క తపన

By:  Tupaki Desk   |   15 May 2018 6:51 AM GMT
విరాట్ కోసం అనుష్క తపన
X
అంతర్జాతీయ మ్యాచుల్లో ఎన్నో మరపురాని విజయాలు సొంతం చేసుకుని అప్రహతిహతంగా సాగుతున్న ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపిఎల్ లో టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు. సౌత్ టీమ్స్ హైదరాబాద్-చెన్నై అలవోకగా ప్లే ఆఫ్ చేరుకోగా మరో టీం బెంగుళూరుకు సారధ్యం వహిస్తున్న కోహ్లీకి మాత్రం ఇది పెద్ద టాస్క్ అయిపోయింది. కేవలం ఐదు విజయాలతో ప్లే అఫ్ ప్లేస్ కోసం కష్టపడుతున్న విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఫేస్ చేయాల్సిన ఛాలెంజులు చాలా ఉన్నాయి. అన్ని మ్యాచులు గెలిచి తీరాల్సిన దశలో బెంగుళూరు టీం ఎలా సెట్ బ్యాక్ అవుతుంది అనే దాని మీదే అందరి దృష్టి ఉంది. ఇది గుర్తించింది కాబోలు విరాట్ భార్య బాలీవుడ్ హీరొయిన్ అనుష్క శర్మ ఫీల్డ్ లోకి వచ్చేసింది. అంటే గ్రౌండ్ లోకి కాదు లెండి. స్టాండ్స్ లో నుంచి. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా తన భర్త మ్యాచులకు మాత్రం ఆ టైంకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న అనుష్క శర్మ భర్త కోసం బాగానే కష్టపడుతోంది.

అందులో భాగంగా టీంకి మోటివేషన్ ఇవ్వడం ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పైన చూసారుగా విరాట్ కోహ్లీ లక్కీ నెంబర్ 18 ఉన్న జెర్సీని వేసుకుని మద్దతు ఎలా ఇస్తోందో. నిజానికి కోహ్లీకి ఇలాంటి మద్దతు చాలా అవసరం. ఆ మధ్య కొన్ని అంతర్జాతీయ మ్యాచుల్లో విరాట్ సెంచరీ కొట్టాక అనుష్క వైపు చూసి విష్ చేయటం అందరూ చూసారు. సో గ్రౌండ్ లో తానుంటే భర్తతో పాటు టీం సభ్యులకు కూడా హుషారు ఇచ్చినట్టు ఉంటుందని భావించిన అనుష్క శర్మ క్రమం తప్పకుండా బెంగుళూరు మ్యాచులకు వెళ్తోంది. ప్రస్తుతం సూయ్ ధాగా షూటింగ్ చివరి స్టేజి లో ఉన్న అనుష్క అందులో ఒక సాధారణ గ్రామీణ మహిళగా నటిస్తోంది. షారుఖ్ ఖాన్ జీరోలో కూడా నటిస్తున్న అనుష్క శర్మ ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేయడానికి రెడీ అవుతోంది. విరాట్ తో పెళ్ళయ్యాక కూడా తన జోరుకు బ్రేకులు పడలేదు. విరాట్ ఒకవైపు క్రికెట్ లో అనుష్క ఇటువైపు సినిమాల్లో ఒకేసారి వెలిగిపోతున్నారు. అన్నట్టు విరాట్ కోహ్లీ బయోపిక్ తీయాలని అనుష్క కోరికట. కాని విరాట్ మాత్రం వరల్డ్ కప్ లాంటి ఘనత ఏదైనా సాదిస్తే అప్పుడు తీయమని చెప్పాడట