Begin typing your search above and press return to search.
యువరాజ్ పెళ్లిలో వాళ్లిద్దరే ప్రత్యేక ఆకర్షణ
By: Tupaki Desk | 27 Nov 2016 11:30 AM GMTసెలబ్రెటీ లవర్స్ విషయంలో బ్రేకప్ ఉంటుంది కానీ.. బ్రేకప్ తర్వాత రీయూనియన్ అన్నది అరుదు. ఐతే విరాట్ కోహ్లి.. అనుష్క శర్మ మాత్రం ఆశ్చర్యకరంగా ఒకసారి విడిపోయాక మళ్లీ కలిశారు. ముందు ఎందుకు విడిపోయారో తెలియదు. మళ్లీ ఎందుకు కలిశారో తెలియదు. మొత్తానికి రీయూనియన్ అయితే జరిగింది. ఈ మధ్య విరాట్ పుట్టిన రోజు సందర్భంగా ఇండియన్ క్రికెట్ టీం బస చేస్తున్న హోటల్ కే వచ్చేసింది అనుష్క. దీంతో ఇద్దరి మధ్య బంధం ఒకప్పటి స్థాయిలో దృఢంగా ఉందని అర్థమైంది. తాజాగా ఒక హై ప్రొఫైల్ పెళ్లిలో ఈ జోడీనే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఆ పెళ్లి మరెవరిదో కాదు.. టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్.. అతడి ప్రేయసి హేజెల్ కీచ్ లది.
ఈ నెల 30న ఛండీగడ్లో యువరాజ్ పెళ్లి జరగబోతోంది. యాదృచ్ఛికంగా టీమ్ఇండియా ప్రస్తుతం మొహాలిలోనే టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ ఐదు రోజులూ సాగితే 30వ తారీఖే ముగుస్తుంది. ఆ రాత్రికి టీం అంతా యువరాజ్ పెళ్లి వేడుకలో ప్రత్యక్షమైపోతుంది. బహుశా ఇండియన్ టీం అంతా రావాలనే యువీ ఇలా పెళ్లి ప్లాన్ చేశాడేమో. ఐతే పెళ్లి వేడుకలో పాల్గొనే అతిథులు చాలా తక్కువమంది కాగా.. అందులో అనుష్క శర్మ కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె ఇప్పటికే భారత్ మ్యాచ్ ఆడుతున్న మొహాలికి చేరుకుంది. కోహ్లి స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆమెను తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి 30న యువీ పెళ్లిలో సందడి చేయబోతున్నట్లు తెలిసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/