Begin typing your search above and press return to search.
కోహ్లీని అమ్మడు అంత టార్చర్ పెట్టిందా?
By: Tupaki Desk | 10 Feb 2016 4:22 AM GMTటీమిండియాలో ఏ క్రికెటర్ కి లేని క్రేజ్ విరాట్ కోహ్లీకి సొంతం. చిన్నా.. పెద్దా అతగాడిని పిచ్చ పిచ్చగా అభిమానిస్తుంటారు. అతగాడి దూకుడు అతన్ని మరింత స్పెషల్ గా ఉంచుతుంది. అలాంటి కోహ్లీ.. బాలీవుడ్ అందాల భామ అనుష్కశర్మతో చెట్టాపట్టాలు వేసుకొని తిరగటమే కాదు.. వీరి కోసం బీసీసీఐ తన రూల్స్ ను కూడా కాస్త మార్చుకున్న పరిస్థితి. కోహ్లీ లాంటి ఆటగాడి కోసం బీసీసీఐ సైతం కాస్త సర్దుకోవాల్సి వచ్చింది. ఏ చెట్టు చూసినా.. ఏ పుట్ట చూసినా వీరే అన్నట్లుగా మీడియాలో తరచూ ఈ జంటకు సంబంధించి కబుర్లు కనిపించేవి.
పెళ్లి కాని భార్యభర్తలుగా వీరిద్దరూ వ్యవహరించే వారన్న మాట కూడా బాగానే వినిపించింది. అలాంటి వీరిద్దరూ విడిపోయారన్నది హాట్ టాపిక్. ఈ ఇద్దరూ బహిరంగంగా తమ బ్రేకప్ గురించి చెప్పుకోపోయినా.. వీరిద్దరూ అలానే వ్యవహరించటం.. అందుకు సంబంధించిన పలు పరిణామాలు చోటు చేసుకోవటం కనిపించటంతో వీరి బ్రేకప్ పక్కా అన్న మాటలు వినిపిస్తున్నాయి.
తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన కోహ్లీ.. అనుష్కల బ్రేకప్ ను తేల్చేసిన పరిస్థితి. కోహ్లీనే తనకు తానుగా బ్రేకప్ గురించి చెప్పేయటమే కాదు.. అనుష్క టార్చర్ ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేసినట్లుగా ముంబయికి చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ తన ప్రత్యేక కథనంలో పేర్కొనటం గమనార్హం.
ఇటీవల అంగద్ బేడీ బర్త్ డే సందర్భంగా ఒంటరిగా హాజరైన కోహ్లీ.. అనుష్కతో లవ్వాటకు ముందు ఎలాంటి హుషారుతో ఉండేవాడో అచ్చు అలానే ఉన్నాడట. అంతేకాదు.. అందరిని నవ్వించటం.. కవ్వించటంతో పాటు.. క్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్లతో.. ఇప్పుడు నేను సింగిల్.. కలిసి డ్యాన్స్ చేద్దామన్న మాటను అనేశాడట.
అంతేకాదు.. అనుష్క కంట్రోలింగ్ గర్ల్ ఫ్రెండ్ అని.. ఎప్పుడూ ఆమె జపం చేయాల్సి వచ్చేదంటూ అమ్మడితో తనకున్న అనుభవాన్ని సన్నిహితుల దగ్గర వాపోయారట. తాజా పార్టీలో అనుష్క గురించి కోహ్లీ చెప్పిన మాటలతో.. వారి బ్రేకప్ పక్కా అని తేల్చేస్తున్నారు. సో.. మరో సెలబ్రిటీ జంట ఖాయంగా విడిపోయినట్లేనని తేల్చేస్తున్నారు.