Begin typing your search above and press return to search.

మ‌రిన్ని చిక్కుల్లో `విరుష్క` జంట‌!

By:  Tupaki Desk   |   23 Jun 2018 5:11 PM GMT
మ‌రిన్ని చిక్కుల్లో `విరుష్క` జంట‌!
X
రోడ్డుపై చెత్త‌వేసిన కార‌ణంతో అర్హాన్ అనే యువ‌కుడిపై అనుష్క మండిప‌డిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అర్హాన్ కు అనుష్క క్లాస్ పీక‌డం - దానికితోడు ఆ వీడియోను విరాట్ షూట్ చేసి అర్హ‌న్ ప్రైవ‌సీకి భంగం క‌లిగించ‌డంతో విరుష్క జంట‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాను చేసిన ప‌నిక‌న్నా అనుష్క‌ - విరాట్ లు చేసిన ప‌ని చెత్త అని అర్హ‌న్ తో పాటు అత‌డి త‌ల్లి కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా అనుష్క‌ - విరాట్ ల‌కు అర్హ‌న్ మ‌రో షాకిచ్చాడు. ఈ స్టార్ క‌పుల్ కు వ్య‌తిరేకంగా అర్హ‌న్ లీగ‌ల్ నోటీసులు పంపించాడు. త‌నను విమ‌ర్శించ‌డంతో పాటు ఆ వీడియోను రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అర్హ‌న్ ఈ విధంగా చేసిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కూడా ఆ లీగల్ నోటీసులో అర్హ‌న్ డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

తాను పొర‌పాటును రోడ్డుపై చెత్త వేసినందుకు గ‌తంలోనే అర్హన్‌ క్షమాపణలు చెప్పాడు. కానీ, త‌న‌తో అనుష్క‌, విరాట్ లు ప్ర‌వ‌ర్తించిన తీరు ఏ మాత్రం మ‌ర్యాద‌గా లేద‌ని బాహాటంగా వెల్ల‌డించాడు. విరుష్క జంట చేసిన ప‌నికి వారిపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ, అర్హ‌న్ వీడియోపై క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోగా క‌నీసం క‌ర్ట‌సీ కోసం ఒక ట్వీట్ చేయ‌లేదు. దీంతో, లీగ‌ల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు అర్హ‌న్ సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. అయితే, అర్హన్‌ పంపిన లీగ‌ల్ నోటీసులపై అనుష్క, విరాట్ లు స్పందించాల్సి ఉంది. అర్హ‌న్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే విరాట్, అనుష్క‌ల‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఇపుడు లీగ‌ల్ నోటీసుల నేప‌థ్యంలో అయినా ఈ వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేసేందుకు అనుష్క‌ - విరాట్ లు ప్ర‌య‌త్నిస్తారో లేదో చూడాలి.