Begin typing your search above and press return to search.

​న్యూయార్క్ నగరంలో పచారీ కొనుక్కుంటూ..

By:  Tupaki Desk   |   15 July 2017 9:42 AM GMT
​న్యూయార్క్ నగరంలో పచారీ కొనుక్కుంటూ..
X
మన హీరోయిన్లులో కొందరు మేకప్ లేకుండా కనిపించడానికి అంతగా ఇష్టపడరు. ఎక్కడికి వెళ్ళినా స్టార్ లానే వెళ్తారు. కానీ అల్లరి అందం సమపాళ్లలో ఉన్న అనుష్క శర్మ మాత్రం సాధారణ అమ్మాయిలా కనిపించడానికి ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. వరస సినిమా షూటింగ్ లతో ఈ మధ్య బాగ బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. బ్రేక్ తీసుకుని న్యూయార్క్ లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్ళింది. అందుకని అనుష్క న్యూయార్క్ లోనే కొన్నిరోజులు ఉందాం అని ఫిక్స్ అయ్యింది. ఇక దొరికిన ఈ ఫ్రీ టైమ్ ను తన ప్రియుడుతో గడిపేస్తోంది.

విరామం లేకుండా మ్యాచ్లు ఆడుతూ రోజు సాధన చేస్తూ బాగా అలిసి పోయిన విరాట్ కొహ్లీ కూడా.. అనుష్క అడిగే సారికి వెంటనే న్యూయార్క్ కు బయలుదేరి వెళ్లిపోయాడు. అక్కడకు వెళ్ళగానే వాళ్ళు సెల్ఫి కూడా అప్లోడ్ చేసి ఇద్దరి అభిమానులుకు ఒక సందేశం ఇచ్చేశారు. దానితో అక్కడ వాళ్ళు ఇక్కడ మన అభిమానులు ఇద్దరు ఖుషీ అయిపోయారు. ఇప్పుడు కూడా ఒక ఫోటోను విరాట్ కోహ్లీ ఫ్యాన్ క్లబ్బులో హాల్ చల్ చేస్తుంది. అనుష్క విరాట్ కలిసి పచారీ సామానులు కొనుకోవడానికి సూపర్ బజార్ కు వచ్చి దర్శనమిచ్చారులే.

అనుష్క విరాట్ ల మధ్య ప్రేమ ఇప్పుడు అందరికి తెలిసిన సంగతే కాబట్టి వీళ్ళు మరింత స్వేచ్ఛగా సహజంగా ఇలా పచారీ కొట్లకూ కాఫి షాపులకూ తిరిగేస్తున్నారు. IIFA వేడుకకు అనుష్కతో పాటు విరాట్ కూడా హాజరు అయ్యే ఛాన్స్ ఉందట. అందుకే విరాట్ కూడా న్యూయార్క్ వెళ్ళాడు అని చెబుతున్నారు. 18వ IIFA అవార్డ్ ఫంక్షన్ కి సల్మాన్ ఖాన్ - ఏ.ఆర్. రహ్మాన్ - సుశాంత్ సింగ్ రాజ్పుత్ - శాహిద్ కపూర్ - కరణ్ జోహర్ లాంటి స్టార్లు హాజరు కానున్నారు.