Begin typing your search above and press return to search.

విరాట్ గెడ్డం.. అనుష్క ఏమందంటే..

By:  Tupaki Desk   |   25 April 2017 7:44 AM GMT
విరాట్ గెడ్డం.. అనుష్క ఏమందంటే..
X
విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ ప్రేమపక్షులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలకలు పూర్తయ్యి మళ్లీ పలుకులు ప్రారంభమైన తర్వాత ఈ జంట మరీ దగ్గరైపోయారు. గతంలో తమ ప్రేమను పబ్లిక్ గా వ్యక్తపరిచేవారు కాదు కానీ.. ఈ మధ్య ట్రెండ్ మార్చేసి సోషల్ మీడియాలో ఓపెన్ అయిపోతున్నారు కూడా.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ కొత్త గెటప్ లో కనిపిస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. స్టైలిష్ మేకోవర్ చేసిన విరాట్.. కొత్త టైపులో గెడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు. పై ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్.. 'సారీ బాయ్స్.. ఈ గెడ్డం ఇప్పుడప్పుడే తీయదలచుకోలేదు. నన్ను ఇలా మేకోవర్ చేసిన వాళ్లను తెగ పొగడాల్సిందే' అంటూ రవీంద్ర జడేజా.. హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మలను ట్యాగ్ చేశాడు. ఈ క్రికెటర్స్ అంతా కలిసి.. ఆన్ లైన్ లో తెగ ఛాటింగ్ చేసేసుకుంటూ సందడి చేస్తుంటే.. మధ్యలోకి సడెన్ గా వచ్చేసిన అనుష్క శర్మ.. 'యు కెనాట్' అంటూ కామెంట్ పెట్టి.. విరాట్ గెడ్డంపై తన అభిప్రాయాన్ని చెప్పేసింది.

మీడియా కళ్లకు చిక్కినా గతంలో సైలెంట్ గా ప్రేమించుకున్న ఈ జంట.. 'కావాలంటే ప్రతీ రోజూ వేలంటైన్ డే అవుతుంది. నాకు అన్ని రోజులనూ ఒకటిగా మార్చేశావ్ అనుష్క శర్మ' అంటూ వ్యాలెంటైన్స్ డే నాడు విరాట్ పెట్టిన ట్వీట్ తో కంప్లీట్ గా ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా పలు మార్లు సోషల్ మీడియాలో మాటలతో సందడి చేశారు విరాట్- అనుష్క.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/