Begin typing your search above and press return to search.

తన ప్రియుడి ఎక్స్ తో దీపిక టాకింగ్

By:  Tupaki Desk   |   18 May 2018 8:17 AM GMT
తన ప్రియుడి ఎక్స్ తో దీపిక టాకింగ్
X
సినిమా ఇండస్ట్రీలలో నటీనటుల మధ్య గొడవలు బాగా సాగుతాయని ఒక టాక్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని ఉదాహరణలు అది నిజమని నమ్మేలా చేస్తుంటాయి. ఇది బాలీవుడ్ జనాలకు అలవాటే.. అయితే గతంతో పోల్చుకుంటే అలాంటి పరిణామాలు చాలా వరకు తగ్గుతున్నాయి. తారల మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా కూడా బయటకు చెప్పుకోవడం లేదు. ఎవరో చిన్నా చితక ఆర్టిస్ట్ లు పబ్లిసిటీ కోసమే గొడవలు చేయడం తప్ప అందులో పెద్ద మ్యాటట్ ఉండదు.

ఇకపోతే గతంలో గొడవలు పడుతూ కొంచెం కాంట్రవర్షియల్ గా మరీనా ఇద్దరు హీరోయిన్స్ ఇప్పుడు ఫ్రెండ్లి గా సోషల్ మీడియాలో బహిరంగంగా మాట్లాడుకోవడం వైరల్ అయ్యింది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో హీరోయిన్ దీపికా పదుకొనె తన స్టైలిష్ లుక్ తో అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ధరించిన డ్రెస్ పై పలువురు సెలబ్రెటీలు పాజిటివ్ కామెంట్ చేయగా అనుష్క శర్మ కూడా స్పందించింది. రెడ్ కార్పెట్ పై దీపిక కనిపించిన విధానం స్టన్నింగ్ గా ఉందని.. దీపిక నువ్ చాలా అందంగా ఉన్నావని అనుష్క కామెంట్ చేసింది. ఇక ఆమె అలా ప్రశంసించగానే దీపిక కూడా తన వైపు నుంచి మంచి రిప్లై ఇచ్చింది.

థ్యాంక్యూ సో మచ్ అనుష్క అంటూ.. లవ్ స్టిక్కర్స్ తో తన ప్రేమను అభిమానాన్ని వ్యక్తపరచింది. ఇక అభిమానులు వీరి కామెంట్స్ గురించి వైరల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అనుష్క అండ్ దీపిక టాకింగ్ అంటూ వారు కూడా పండగ చేసుకుంటున్నారు. గతంలో క్యాట్ ఫైట్ చేసుకున్న బ్యూటీలు ఇప్పుడు ఎంత స్నేహంగా మాట్లాడుకుంటున్నారో అని కామెంట్ చేస్తున్నారు.