Begin typing your search above and press return to search.
సుశాంత్ మృతి : డిప్రెషన్ పై అనుష్క సలహాలు
By: Tupaki Desk | 16 Jun 2020 9:10 AM GMTసుశాంత్ రాజ్ పూత్ మరణం అభిమానులతో పాటు సినీ వర్గాల వారిని కూడా కదిలించింది. ఎంతో మంది స్టార్స్ సినీ ప్రముఖులు సుశాంత్ మరణంపై స్పందించారు. సుశాంత్ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పలువురు స్టార్స్ కూడా గతంలో తాము డిప్రెషన్ కు లోనయినట్లుగా పేర్కొన్నారు. హీరోయిన్ దీపిక పదుకునే ఒకానొక సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాను అంటూ వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క స్పందించింది.
సోషల్ మీడియా ద్వారా అనుష్క డిప్రెషన్ గురించి కాస్త ఎక్కువ వివరణ ఇచ్చింది. సెలబ్రెటీ అయినా సామాన్యుడు అయిన కూడా కష్టాలు కన్నీరు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ పరిస్థితుల నుండి బయట పడేందుకు కష్టపడాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి జీవితం ఫర్ ఫెక్ట్ గా లేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టాలను ఎదుర్కోవాల్సిందే. జీవితంలో ఏం జరిగినా సానుకూల దృక్పదంతో ముందుక సాగాలి తప్ప జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం తప్పు అంది.
డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఇతరులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా సరదాగా ఎవరితో అయితే గడుపుతారో వారిని మీ వద్ద ఉంచుకోవాలి. ఎదుటి వారు ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా వారిని చూసి చూడనట్లుగా వదిలేయకుండా వారితో సమయంను గడిపేందుకు ప్రయత్నించండి. ఇతయి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నట్లయితే వారిపై మానవత్వం ప్రదర్శించినప్పుడే వారు డిప్రెషన్ నుండి బయట పడగలరు అంటూ అనుష్క పేర్కొంది.