Begin typing your search above and press return to search.

సావిత్రి సినిమాలో వాళ్ళిద్దరూ??

By:  Tupaki Desk   |   19 April 2017 7:56 AM GMT
సావిత్రి సినిమాలో వాళ్ళిద్దరూ??
X
సావిత్రి జీవిత చరిత్రపై 'మహానటి' మూవీ తెరకెక్కనుంది. ఎవడే సుబ్రమణ్యం దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. రెండేళ్ల పాటు రీసెర్చ్ చేసి.. ఇప్పటికి ప్రీ ప్రొడక్షన్ పనుల దశకు తీసుకొచ్చాడు. ఇప్పటికే లీడ్ రోల్ లో సావిత్రిగా కీర్తి సురేష్ ను ఎంచుకోగా.. ఆమె జీవితంపై రీసెర్చ్ చేసే జర్నలిస్ట్ గా కీలక పాత్రలో సమంతను ఖాయం చేసుకున్నారు.

మహానటిలో నటించాలంటూ.. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్స్ ను సంప్రదించడం హైలైట్ అవుతోంది. సౌత్ లో బోలెడంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అనుష్క.. అలాగే కేరక్టర్ ఆర్టిస్ట్ కి స్టార్ డం ఆపాదించిన ప్రకాష్ రాజ్ లతో చర్చలు నిర్వహించారట మహానటి టీం. వీరిని ఏఏ పాత్రల కోసం సంప్రదించారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అలాగే.. వీరి నుంచి రియాక్షన్ ఏంటి.. సినిమాలో నటించబోతున్నారా లేదా అని ఇప్పుడే చెప్పడం కష్టమైన విషయమే. అయితే.. మహానటి జీవితంపై తెరకెక్కే సినిమాలో ఓ పాత్ర చేసే అవకాశం రావడాన్ని మాత్రం.. ఏ యాక్టర్ అయినా ప్రతిష్టాత్మకంగానే తీసుకునే ఛాన్స్ ఉంది.

మహానటి మూవీలో.. సావిత్రి భర్త జెమినీ గణేశన్ ఎపిసోడ్ కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఆమె జీవితంలోని అత్యుత్తమ స్థాయికి ఎదిగిన తీరు.. అక్కడి నుంచి తిరిగి జారిపోవడం వరకు.. అన్ని కీలక అంశాలను చూపించబోతున్నారట. అలాగే తెలుగు వెర్షన్ కు.. తమిళ వెర్షన్ కు కూడా కథలోనే కీలక మార్పులు కూడా ఉంటాయని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/