Begin typing your search above and press return to search.

ముద్దులొలికే పాపాయి నేటి బిగ్ స్టార్.. ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   15 Aug 2021 3:30 AM GMT
ముద్దులొలికే పాపాయి నేటి బిగ్ స్టార్.. ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా?
X
మేటి నాయిక‌లు త‌మ బాల్యం నాటి జ్ఞాప‌కాల్లోకి వెళుతున్నారు. అరుదైన‌ ఫోటోల్ని తెరపైకి తెస్తున్నారు. కొన్ని అభిమానులు వెతికి అందిస్తుంటే.. మ‌రికొన్నిటిని భామ‌లే రిలీజ్ చేస్తున్నారు. బుడి బుడి అడుగులు వేసే నాటివి.. పాకుతూ వెళుతూ.. స్కూల్ కి వెళుతూ ఇలా ర‌క‌ర‌కాల ఫోటోల‌ను జ్ఞాప‌కాల దొంత‌ర‌ల నుంచి తీసి వ‌దుల్తున్నారు. వీటికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది.

ఏదేమైనా భామ‌లు క్రేజ్ ని పెంచుకునే ప్ర‌య‌త్నమే ఇది. దీనివ‌ల్ల సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. ఇప్ప‌టికే హ‌న్సిక‌.. పాయ‌ల్ రాజ్ పుత్..స‌మంత‌.. అంజ‌లి లాంటి భామ‌ల బాల్యానికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ అగ్ర క‌థానాయిక అనుష్క శెట్టి బాల్యంలో ముద్దులొలికే పాపాయి లుక్ లో సోష‌ల్ మీడియాని కుదిపేస్తోంది. అనుష్క చిన్న నాటి ఫోటో ఒక‌టి ఇటీవ‌ల‌ జోరుగా వైర‌ల్ అవుతోంది. అందులో అనుష్క వ‌య‌సు రెండు.. మూడేళ్లు ఉండొచ్చు.

చెడ్డి మాత్రం ధ‌రించింది. మెడ‌లో బంగారు గొలుసు...కాళ్ల‌కు ప‌ట్టీలు..తెల్ల చెడ్డీ .. ముఖానికి రూపాయి బిళ్లంత న‌ల్ల‌టి తిల‌కం బొట్టు.. బుగ్గ‌న దిష్టి చుక్క‌తో క్యూట్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. హెయిర్ కూడా కాస్త రింగులు తిరిగింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. ఇది ఎలా లీకైందో తెలియ‌దుగానీ నెట్టింట మాత్రం దూసుకుపోతోంది. అనుష్క‌కు భారీ ఎత్తున ఫాలోవ‌ర్స్ ఉండ‌టంతో ఈ చిన్న నాటి పోటోపై కామెంట్లు క‌వ్విస్తున్నాయి. ఈ పాపాయి చూస్తుండ‌గానే ఇంత పెద్ద పాపాయి అయిపోందా? ఇంత పెద్ద హీరోయిన్ అయ్యిందా? నెటిజ‌నులు కామెంట్లు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక అనుష్క సినిమాల విష‌యానికి వ‌స్తే `నిశ‌బ్ధం` త‌ర్వాత ఆమె రియ‌ల్ లైఫ్ లో నిశ్శ‌బ్ధంగానే ఉన్నారు. కొత్త ప్రాజెక్ట్ లేవి క‌మిట్ అవ్వ‌లేదు. పూర్తిగా బెంగుళూరులోని కుటుంబ స‌భ్యుల‌తోనే స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. అప్పుడ‌ప్పుడు హైద‌రాబాద్ లో త‌న స్నేహితులు క‌ల‌వడానికి వ‌చ్చి వెళ్తున్నారంతే. సినిమా ప్ర‌య‌త్నాలేవి కూడా తాను వ్య‌క్తిగ‌తంగా చేస్తున్న‌ట్లు లేదు. పెళ్లిపై వార్త‌లొస్తున్న‌ప్ప‌టికీ ఆ ఘ‌ట్టం కూడా పూర్తి చేయ‌లేదు. మ‌రి ఈ మౌనం ఎన్నాళ్లు అన్న‌ది అమ్మ‌డు నోరు విప్పితే గాని తెలియ‌దు.