Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం ఏదైనా వదిలేస్తా: అనుష్క

By:  Tupaki Desk   |   24 March 2020 3:30 AM GMT
ప్రభాస్ కోసం ఏదైనా వదిలేస్తా: అనుష్క
X
స్వీటీ శెట్టి.. అలియాస్ అనుష్క శెట్టి. తెలుగు తెరకు పరిచయం అక్కర్లేని పేరు. సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి అతి తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారింది. అనంతరం తెలుగు - తమిళ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. దాదాపుగా తెలుగు - తమిళ బాషలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన అనుష్క.. హీరోలతో పాటు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అయిన అరుంధతి - బాహుబలి లాంటి గొప్ప సినిమాలతో తన పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

బాహుబలి తర్వాత చాలా విరామం తీసుకొని 'నిశ్శబ్దం' అనే పాన్ ఇండియన్ మూవీతో మళ్ళీ తెరమీద సందడి చేయనుంది. అయితే నిశ్శబ్దం సినిమాకి అనుష్క ఫిల్మ్ కెరీర్ 15యేళ్ళ మైలురాయినీ చేరుకుంది. ఈ 15ఏళ్లలో తను ఎదుర్కొన్న ఒడిదుడుకులను - తారసపడిన పరిస్థితులను - మిత్రులను - అభిమాన దర్శకులను తలచుకొని ఇటీవలే ఒక టీవీ షోలో కంటతడి పెట్టుకుంది.

ముఖ్యంగా అనుష్కను వెండితెరకు పరిచయం చేసిన పూరీజగన్నాథ్ గురించి మాట్లాడి - అనంతరం తనకు తిరుగులేని నటిగా నిలబెట్టిన - స్టార్ డం అందించిన అరుంధతి సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ గురించి గొప్పగా మాట్లాడుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన గ్రేట్ కోడి రామకృష్ణ గారు మరణాన్ని తలచుకొని బాగా ఎమోషనల్ అయిపోయింది. తను ఏడవటమే కాక షోలో ఉన్నవాళ్లను - షో చూసినవాళ్లను కూడా ఏడిపించేసింది. ఏదేమైనా స్వీటీకి స్వీట్ మనసుతో పాటు గొప్ప ప్రవర్తన కూడా కలిగి ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. అంతేగాక లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే డార్లింగ్ ప్రభాసే అని. తన స్నేహం కోసం దేన్నీ వదులుకోడానికైనా వెనుకాడనని తెగేసి చెప్పి ప్రభాస్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఇలాంటి గొప్ప స్నేహితురాలు మాకు కూడా ఉంటే బాగుంటుందని అభిమానులంతా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.