Begin typing your search above and press return to search.

స్వీటీకి మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్టే కావాల‌న్న మ‌మ్మీ‌!

By:  Tupaki Desk   |   24 May 2020 8:24 AM GMT
స్వీటీకి మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్టే కావాల‌న్న మ‌మ్మీ‌!
X
అమ‌రేంద్ర బాహుబ‌లి - దేవ‌సేన కెమిస్ట్రీని అంత తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌రా?.. `బిల్లా` చిత్రంలో అనుష్క‌తో ప్ర‌భాస్ రొమాన్స్ ని అంత తేలిగ్గా లైట్ తీస్కోగ‌ల‌రా? ఇక‌పోతే `మిర్చి`లో ఈ రొమాంటిక్ క‌పుల్ సాంగ‌త్యాన్ని ఎవ‌రైనా అంత తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌రా?. ఇవేనా... అప్ప‌ట్లో రాజ‌మౌళి వార‌సుడు కార్తికేయ పెళ్లిలోనూ ప్ర‌భాస్ - అనుష్క జోడీ చేసిన సంద‌డిని కూడా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు.

అయితే అంత చ‌క్క‌ని కెమిస్ట్రీ వ‌ల్ల‌నేనేమో.. ఆ ఇద్ద‌రూ ప‌ర్ఫెక్ట్ ల‌వ్ క‌పుల్‌ అని అభిమానులు ఫిక్స‌యిపోయారు. అంత‌కుమించి మీడియా కూడా మ‌రీ ఇదిగా ఫిక్స‌యిపోయి గాసిప్పుల‌తో వేడెక్కించింది. ముఖ్యంగా తెలుగు మీడియాని మించి హిందీ మీడియాలో ప్ర‌చారం సాగిపోయింది. సౌత్ లో హాట్ ల‌వ్ క‌పుల్ ఎవ‌రు? అంటే.. ప్ర‌భాస్- అనుష్క వైపే చూపిస్తుంది ఉత్త‌రాది మీడియా. అంత‌గా పాపులారిటీ ఉంది నార్త్ అభిమానుల్లో ఈ జంట‌కు. ప్ర‌తిసారీ ప్ర‌భాస్ కి కానీ అనుష్క‌కు కానీ ఎదుర‌య్యే ఒకే ఒక్క ప్ర‌శ్న పెళ్లెప్పుడు? అనే.. అయితే ప్ర‌తిసారీ ఈ జంట ఆ వార్త‌ల్ని ఖండిస్తూనే ఉన్నారు.

కేవ‌లం స్నేహితులం మాత్ర‌మేన‌ని చెబుతూనే ఉన్నారు. ఒకానొక సంద‌ర్భంలో స్వీటీ అయితే కాస్త క‌టువుగానే స‌మాధానం ఇచ్చింది. దేవ‌సేన - బాహుబ‌లి కెమిస్ట్రీ చూసి మోస‌పోవ‌ద్దు.. రియాలిటీలోనూ అలా ఉంటామ‌ని అనుకోవ‌ద్దు.. మేం స్నేహితులం మాత్ర‌మేన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. అన్న‌ట్టు స్వీటీకి ఇంట్లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్నార‌ని చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌కు ఎలాంటి వ‌రుడు కావ‌లెను? అని ప్ర‌శ్నిస్తే మాత్రం.. అనుష్క త‌ల్లి గారు ప్ర‌ఫుల్లా శెట్టి ``నిజ జీవితంలోనూ ప్ర‌భాస్ లాంటి మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అనుష్క‌కు వ‌రుడుగా కావాల‌``ని కోరుకున్నారు. దీనిని బ‌ట్టి డార్లింగ్ ప్ర‌భాస్ పై స్వీటీ పేరెంట్ అభిప్రాయం కూడా క్లియ‌ర్ క‌ట్ గా అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ప్ర‌భాస్ కి మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేసేయాల‌ని పెద‌నాన్న కృష్ణంరాజు అంతే ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ప్ర‌భాస్ ప‌దే ప‌దే పెళ్లి మాట‌ను దాట వేస్తుంటే విసిగిపోయారు ఆయ‌న కూడా. ప్ర‌భాస్ ఫ్రెండు భ‌ళ్లాల‌దేవ రానా ఓపెనైపోయాడు. కానీ ఇంకా ప్ర‌భాస్ ఎందుక‌నో ఓపెన్ కావ‌డం లేదు! ప్చ్!!