Begin typing your search above and press return to search.
స్పాట్ లైట్ లోకి త్వరలో.. అంటున్న స్వీటీ
By: Tupaki Desk | 3 July 2019 7:01 AM GMTటాలీవుడ్ లో చాలామందే స్టార్ హీరోయిన్లు ఉన్నారు కానీ వారందరిలో అనుష్క స్థానం ప్రత్యేకమైనది. టాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే హీరోయిన్ కూడా స్వీటీనే. ప్రస్తుతం అనుష్క 'సైలెన్స్' అనే చిత్రంలో నటిస్తోంది. కొంతకాలం క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అంతలోనే ఈ సినిమా 50% చిత్రీకరణ పూర్తి చేసుకుందని సమాచారం.
త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని కూడా 'సైలెన్స్' టీమ్ ప్రకటించారు. ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేలోపే అనుష్క తన అభిమానులకు ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "త్వరలో స్పాట్ లైట్ లోకి వస్తాను #సైలెన్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలో రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టేజ్ మీద నిలబడి ఉంది. తన చేతిలో ఒక పుస్తకం కూడా ఉంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత అనుష్క దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ అప్డేట్ కావడం తో ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ క్యాప్షన్ కు స్పందనగా "మేము వెయిటింగ్" అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్ పెట్టారు.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. అంజలి.. షాలిని పాండే.. అవసరాల శ్రీనివాస్.. సుబ్బరాజు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్ మైఖెల్ మ్యాడిసన్ కూడా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.