Begin typing your search above and press return to search.

రహస్యాల్ని పుస్తకరూపంలో తీసుకొస్తున్న అనుష్క

By:  Tupaki Desk   |   14 May 2019 5:30 PM GMT
రహస్యాల్ని పుస్తకరూపంలో తీసుకొస్తున్న అనుష్క
X
అనుష్క శెట్టి. మంగళూరు నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అద్భుత సౌందర్యవతి. అజంతా, ఎల్లోరా శిల్పాలకు ఏమాత్రం తగ్గని శరీరాకృతితో ఉండే అనుష్క.. పదేళ్లపాటు టాలీవుడ్‌ ని నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ గా ఏలింది. కానీ మధ్యలో సైజ్‌ జీరో లాంటి సినిమాల కోసం లావెక్కి.. ఆ తర్వాత తగ్గడం మర్చిపోయింది. దీంతో.. ఐశ్వర్యారాయ్‌ లా ఉండే అనుష్క కాస్తా కల్పనారాయ్‌ లా తయారైంది. మరి లావుగా ఉండే హీరోయిన్‌ ని మనవాళ్లు సినిమాల్లో ఎంటర్‌ టైన్ చేయరు కాబట్టి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో.. ఎలాగైనా సరే మునుపటి అందాన్ని మళ్లీ సొంతం చేసుకోవాలనుకున్న అనుష్క.. సినిమాల్ని కూడా పక్కన పెట్టేసి సీరియస్‌ గా ట్రై చేసింది. ఇప్పుడు మళ్లీ తాను అనుకున్న ఫిజిక్‌ కు వచ్చేసింది. దీనికి ఆమె పడిన కష్టం ఏంతో ఉంది. అయితే.. తాను బరువు ఎలా తగ్గానో మీ అందరికి కూడా చెప్తానంటోంది అనుష్క.

వివరాల్లోకి వెళ్తే.. మనకు మంతెన, వీరమాచినేనిలా అంతర్జాతీయ స్థాయిలో ల్యూక్‌ కొటిన్హో అని ఒకాయన ఉన్నాడు. సహజ పద్ధతుల్లో బరువు ఎలా తగ్గాలో చెప్పడంలో ల్యూక్ నిష్టాతుడు. అతడి టిప్స్‌ ఫాలో అయిన అనుష్క.. నేచురల్‌ గా, అందం ఏమాత్రం చెడగొట్టుకోకుండా సన్నబడి సన్నజాజిలా మారింది. దీంతో.. ఇప్పుడు అతగాడు రాసిన ద మ్యాజిక్‌ వెయిట్‌ లాస్‌ పిల్‌ అనే పుస్తకాన్ని త్వరలోనే లాంచ్‌ చేయబోతున్నారు. ఈ పుస్తకం కవర్‌ పేజ్‌ పై అనుష్క ఫోటోని ముద్రించారు. ఈ బుక్‌ లో 62 పద్ధతుల్లో ఈజీగా బరువు తగ్గడం ఎలాగో ల్యూక్‌ సమగ్రంగా వివరించాడు. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా తాను ఎలా బరువు తగ్గానో తెలుసుకోండి.. మీరు కూడా నాలా అందంగా, నాజూగ్గా అవ్వడం అని చెప్తోంది అనుష్క.

బరువు తగ్గాలే కానీ అనుష్క కోసం క్యూ కట్టే నిర్మాతలు చాలామందే ఉన్నారు. అయితే అనుష్క మాత్రం హీరోల పక్కన డ్యాన్సులేసే కేరక్టర్లు కాకుండా.. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు చేయాలని అనుకుంటుంది. త్వరలో అరవ హీరో మాధవన్‌ తో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత పరిస్థితిని బట్టి మరిన్ని సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటోంది అనుష్క.