Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌ నిక్ ‌నేమ్ లీక్ చేసేసిందే.. స్వీటీకి మాత్ర‌మే ఆ ఛాన్స్?

By:  Tupaki Desk   |   24 Oct 2020 4:00 AM GMT
ప్ర‌భాస్‌ నిక్ ‌నేమ్ లీక్ చేసేసిందే.. స్వీటీకి మాత్ర‌మే ఆ ఛాన్స్?
X
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈ శుక్ర‌వారం 41 పూర్త‌యి 42వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా చాలా మంది సెల‌బ్రిటీలు..., ఫ్యాన్స్ ప్ర‌భాస్ ‌పై జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిపించారు. పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌తో సోష‌ల్ మీడియాని హోరెత్తించారు. ఎవ‌రెలా విషెస్ అందించినా.. శుభాకాంక్ష‌లు తెలిపినా అనుష్క నుంచి వ‌చ్చే ట్వీట్ చాలా ప్ర‌త్యేకంగా వుంటుంద‌ని అంతా ఊహించారు.

ఊహించిన‌ట్టే అనుష్క నుంచి షాకింగ్ ట్వీట్ వ‌చ్చేసింది. దీంతో ఆ ట్వీట్ ప్ర‌స్తుతం అభిమానుల్లో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హిట్ టాపిక్‌గా మారింది. ప్ర‌భాస్ - అనుష్క ఇద్ద‌రు క‌లిసి నాలుగు చిత్రాల్లో న‌టించారు. బిల్లా..., మిర్చి,.. బాహుబ‌లి 1 అండ్ 2. ఈ నాలుగు చిత్రాల‌తో వీరిద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింది. ఎంత‌గా అంటే ప్ర‌తి ర‌హ‌స్యాన్ని లీక్ చేసుకునేలా క్లోజ్ ఫ్రెండ్స్ కి మించి. ఆ ఇద్ద‌రి స్నేహంపై ర‌క‌ర‌కాల గాసిప్పులు వేడెక్కించాయి. అంతేనా ఈ జంట పెళ్లాడేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా స‌హా సౌత్ మీడియాలు చేసిన హంగామాని మ‌ర్చిపోలేం.

శుక్రావారం ప్ర‌భాస్ బ‌ర్త్ ‌డే సంద‌ర్భంగా అనుష్క చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ గా మారింది. అంతా ప్ర‌భాస్ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపితే అనుష్క ఎవ‌రికీ తెలియ‌ని ప్ర‌భాస్ నిక్ నేమ్ ‌ని బ‌య‌ట‌పెట్టి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ పుప్సు` అంటూ అనుష్క.. ప్ర‌భాస్ నిక్ ‌నేమ్ ‌ని బ‌య‌ట‌పెట్టింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతోంది అనే అనుమానాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి.