Begin typing your search above and press return to search.
సన్నజాజిలాంటి అనుష్క నడుము
By: Tupaki Desk | 10 Aug 2015 4:18 PM GMTఅబ్బాయిలు తమకి సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలనుకొంటారు. అమ్మాయిలు మాత్రం సన్నజాజిలాంటి నడుము కోరుకొంటారు. అదే సైజ్ జీరో ట్రెండ్. డైటింగులు చేస్తూ, జిమ్ముకి వెళుతూ నాజూకు నడుము అందాల్ని తయారు చేసుకొంటూ అబ్బాయిల్ని కిక్కెస్తుంటారు అమ్మాయిలు. అలాంటి నాజూకు నడుమును కోరుకొన్న ఓ అమ్మాయి కథతో రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. `సైజ్ జీరో` పేరుతో అనుష్క ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఆ సినిమాని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెలతో చిత్రీకరణ పూర్తవుతుంది.
కె.రాఘవేంద్రరావు ఆన్ లైన్ లో టైటిల్ లోగోని విడుదల చేశారు. `సైజ్ జీరో` అన్న టైటిల్ కి క్యాప్షన్ గా `సన్నజాజి నడుము` అని ఉంది. టైటిల్ లో కె.రాఘవేంద్రరావు మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ కథని సమకూర్చడం విశేషం.
అనుష్క ఈ సినిమా లో రెండు రకాలుగా కనిపిస్తుందట. ఒక పాత్రలో భారీగా బరువు పెరిగి బొద్దుగుమ్మలా కనిపిస్తుందట. మరో పాత్రలో నాజూకు నడుముతో కనిపిస్తుందట. సినిమా కోసం ఆమె 20కిలోలకు పైగా బరువు పెరిగి తగ్గినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో తమిళ కథానాయకుడు ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలు పోషించారు.