Begin typing your search above and press return to search.

పుత్తడితో పైరసీని కట్టడి చేస్తారా?

By:  Tupaki Desk   |   23 Nov 2015 1:30 PM GMT
పుత్తడితో పైరసీని కట్టడి చేస్తారా?
X
అనుష్క నటించిన సైజ్ జీరో ఈ వారంలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే బాహుబలి - రుద్రమదేవి చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్లు సాధించి స్పీడ్ మీదున్న అనుష్కకు ఇది మరో ల్యాంట్ మార్క్ ఫిలిం కానుంది. అందుకే పబ్లిసిటీ విషయంలో కొత్త ట్రిక్కులు ప్లే చేస్తున్నారు సైజ్ జీరో నిర్మాతలు. ఇప్పటికే వినూత్నమైన ఐడియాలతో మంచి హైప్ నే తీసుకొచ్చిన మేకర్స్.. ఇప్పుడు టికెట్స్ అమ్మకాల విషయంలోనూ మరో అడుగు ముందుకేశారు.

ఒకో టికెట్ తో కూపన్ ఇస్తామని, విన్నర్ కి కేజీ బంగారం గిఫ్ట్ ఇస్తామని చెబ్తున్నారు. ఇదంతా పైరసీని కంట్రోల్ చేసేందుకే అని చెప్పడం అసలు హైలైట్. ఫిలిం ఇండస్ట్రీని పైరసీ చంపేస్తోందని తమ బాధ కూడా వెళ్లబోసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. నిర్మాతలు అవలంబిస్తున్న డబుల్ స్టాండర్డ్స్ పై కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈమధ్య సినిమా టికెట్స్ ని పెంచుకుంటూ పోతున్నారు. మామూలు థియేటర్లలో కూడా రేట్లు పెంచుకునేందుకు స్పెషల్ పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. మరోవైపు మల్టీప్లెక్సుల్లో ఒకో టికెట్ 150 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. ఇంత రేటు పెట్టి కొని, తమకు కావాల్సిన వినోదం దక్కకపోతే.. ఈ అనుమానంతోనే చాలామంది పైరసీ బాట పడుతున్నారన్నది సుస్పష్టం.

కంటెంట్ బాగున్న మూవీస్ కి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంది. అటూఇటూగా ఉన్న చిత్రాలే పేలిపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించకుండా.. కేవలం పైరసీ ఒకటే ప్రమాదం అన్నట్లుగా ఉంది ఇండస్ట్రీ తీరు. ఇప్పుడు పైరసీని అడ్డుకునేందుకు కేజీ బంగారం ఇచ్చేస్తామని చెబ్తున్నారు. అదేదో సినిమా టికెట్ ని తగ్గించి అమ్మితే అందరికీ ప్రయోజనం ఉంటుందన్నది తిరుగులేని వాస్తవం.