Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: పూలగుత్తుల్లో అందాల బొమ్మ

By:  Tupaki Desk   |   27 April 2016 3:30 PM GMT
ఫోటోస్టోరీ: పూలగుత్తుల్లో అందాల బొమ్మ
X
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను అందాలను చూడాలంటే సహంజగా ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. ఆ రేంజ్ లో మేని సొగసు మిలమిల్లాడడం ఈ భామ ప్రత్యేకత. అలాంటిది.. ఇప్పుడీమెను వోగ్ కవర్ పేజ్ పై చూస్తుంటే.. తనువంతా పూలు చిలకరించినట్లు అయిపోతుంది. ఇందుకు కారణం.. అమె డ్రెసింగ్ స్టైల్.

బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్. పైన వేస్కున్న టాప్ పై రకరకాల రంగురంగుల పూలు.. వాటి వెనుక నుంచి మత్తెక్కించే అందాలు.. తెల్లని అందాలను దాచిపెడుతున్న ఇన్నర్ వేర్.. అన్నిటినీ బైటకు చూపించే ట్రాన్స్ పరెంట్ టాప్.. ఇదీ మే ఎడిషన్ వోగ్ కవర్ పేజ్ పై అనుష్క శర్మ ఇచ్చిన దర్శనం. ఇదంతా సమ్మర్ స్పెషల్ అంట. ఈ ఎండలకు బాగా వేడిగా ఉంటుంది కదా.. అందుకే ఇలాంటి అల్ట్రా లైట్ డ్రసింగ్ చేసుకొచ్చింది అనుష్క శర్మ. కట్టును మించి అమ్మడి పోజులు చేసే కనికట్టుకి మాత్రం ఎవరైనా పడిపోవాల్సిందే.

ప్రస్తుతం అనుష్క శర్మ - విరాట్ కోహ్లీల లవ్ స్టోరీ నిర్విఘ్నంగా కొనసాగుతోందనే విషయం తెలిసిందే. బ్రేకప్ అంటూ టీషర్లుల్లాంటివి వేస్కుని విరాట్ జనాలను టీజ్ చేస్తున్నాడు కానీ.. నిజానికి వీళ్లు ఎంచక్కా ఎప్పటిలాగే కంటిన్యూ అయిపోతున్నారు. మరోవైపు ఈ ఏడాది ఇంకా తొలి మూవీ రిలీజ్ చేయని అనుష్క శర్మ.. సల్మాన్ ఖాన్ తో చేసిన సుల్తాన్ విడుదల కోసం ఎదురుచూస్తోంది.