Begin typing your search above and press return to search.
సన్న స్వీటీని ఎప్పుడు చూపిస్తారు?
By: Tupaki Desk | 4 Sep 2015 6:15 AM GMTకె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన సైజ్ జీరో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్. ఈ సినిమా కోసం స్వీటీ అనుష్క ఏకంగా 21 కేజీల బరువు పెరిగి గుండ్రంగా తయారైంది. దానికి తోడు లడ్డూబాబులా ప్రోస్తటిక్ మేకప్ తో స్వీటీని రెట్టింపు లావు చూపించారు. దీంతో ఆడియెన్ కళ్లన్నీ అటే వెళ్లిపోతున్నాయి. స్వీటీ ఏంటి అకశ్మాత్తుగా ఇంత లడ్డూలా ఎలా అయిపోయింది అన్న డిష్కసన్ స్టార్టయ్యింది. సరిగ్గా ఇదే పాయింటు ఈ సినిమా ప్రచారానికి కలిసొస్తోంది.
దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి తెలివిగా రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ జనాలకు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ఇప్పటికే రెండు టీజర్‌లు రిలీజ్ చేసి క్రేజు పెంచాడు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అన్న ఆత్రం జనాల్లో్ కనిపిస్తోంది. అసలు ఎప్పుడు రిలీజవుతుంది. స్వీటీని తెరపై ఎంత త్వరగా చూసేద్దాం? అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది. ఇంతకాలం రొటీన్ గ్లామర్ డాళ్ పాత్రల్లో కనిపించిన అనుష్కను డిఫరెంట్ జోనర్‌లో చూడాలన్న తహతహ అంతకంతకు పెరిగిపోతోంది. లడ్డూలాంటి అమ్మాయితో ఆర్య ఎలా వేగాడా? అన్న కుతూహాలం పెరిగింది. బొద్దమ్మాయ్ సన్నజాజిలా ఎలా మారుతుంది? అన్నది తెలుసుకోవాలని ఒబీస్ గాళ్స్ అంతా ముచ్చటపడుతున్నారు.
ఈ సినిమా టీజర్ ని 24గంటల్లో 5 లక్షల మంది వీక్షించారు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఆడియో త్వరలో రిలీజ్ కానుంది. అక్టోబర్ 2 రిలీజ్ తేదీ అని చెబుతున్నారు. అప్పటివరకూ జనాలు ఓపిక పట్టాల్సిందే మరి.