Begin typing your search above and press return to search.

స్లిమ్ స్వీటీ సీక్రెట్ తెలిసిపోయిందిగా

By:  Tupaki Desk   |   10 Feb 2017 8:20 AM GMT
స్లిమ్ స్వీటీ సీక్రెట్ తెలిసిపోయిందిగా
X
బాహుబలి2 న్యూ పోస్టర్ అంటూ రిపబ్లిక్ డే రోజున దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ప్రభాస్-అనుష్కలు జంటగా ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి.. అనుష్క ఇంత సన్నగా ఉందా అనే డిస్కషన్ బాగానే జరిగింది. అనుష్క లుక్ విషయంలో అంత సన్నగా కనిపించడం వెనక అసలు సీక్రెట్ ఇప్పుడు బైట పడినట్లే.

తాజాగా స్వీటీ నటించిన రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సింగం3లో సూర్య భార్యగా నటించిన అనుష్క.. ఓం నమో వేంకటేశాయ చిత్రంలోనూ కనిపించింది. ఈ రెండు సినిమాల్లోను స్వీటీ లావుగానే కనిపించింది. సైజ్ జీరో కోసం పెంచుకున్న సైజులను తగ్గించుకోవడం విఫలం అయింది. భక్తి చిత్రం ఓం నమో వేంకటేశాయను పక్కన పెట్టినా.. సింగం3 లో గ్లామర్ రోల్ అనుష్క లుక్ పై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే.. బాహుబలి2లో స్లిమ్ స్వీటీ సీక్రెట్ తేలిపోయినట్లే. గ్రాఫిక్స్ బేస్డ్ గా తెరకెక్కిస్తున్న బాహుబలిలో.. అనుష్కను అలా చూపించేందుకు మరింత టెక్నాలజీ వాడేసుకున్నారని అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు భాగమతి అంటూ మరో మూవీ కూడా చేస్తోంది అనుష్క. ఇక బాహుబలి2.. భాగమతి తప్ప అనుష్క ఇప్పటివరకూ సైన్ చేసిన సినిమాలేవీ లేవు. కారణం ఇదే అయుండచ్చు అని టాక్. అయితే.. సహజసిద్ధంగానే సన్నబడేందుకు అనుష్క ఇంకా ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు సినీ జనాలు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/