Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: స్వీటీ.. ఓ న్యాచురల్ బ్యూటీ

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:30 PM GMT
ఫోటో స్టోరీ: స్వీటీ.. ఓ న్యాచురల్ బ్యూటీ
X
దక్షిణాదిన ఉండే టాప్ లీగ్ స్టార్ హీరోయిన్లలో అనుష్క పేరును తప్పనిసరిగా చెప్పుకోవాలి. బాహుబలి తర్వాత అనుష్క సినిమాలు తగ్గించింది కానీ ఇప్పటికీ అనుష్క క్రేజ్ మాత్రం ఏమీ తగ్గలేదు. ఇక అనుష్క - ప్రభాస్ మ్యారేజ్ పైన వచ్చే రూమర్లు డిజిటల్ బూస్ట్ తాగుతాయో ఏమో కానీ అసలు వాటికి అలుపుసొలుపూ ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే బాహుబలి క్రేజ్ పుణ్యమా అని అనుష్క బయట కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్కుమంటాయి.

నిన్న రాత్రి అనుష్క ముంబై విమానాశ్రయంలో కనిపించింది. ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా అనుష్కను తమ కెమెరాల్లో బంధించారు. గ్రే కలర్ లాంగ్ టాప్.. చిరుగుల జీన్స్ ధరించి ఎంతో క్యాజువల్ గా తన ట్రాలీ సూట్ కేసును స్టైల్ గా తోసుకుంటూ వచ్చింది. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. సహజంగా చాలామంది భామలు ఇలా బయట కనిపించాలంటే కనీసం ఒక టన్ను మేకప్ సామగ్రి వాడి మొహంపై ఒక లేయర్ పెయింట్ కొడతారు. ఎండకు వానకు రాలకుండా ఉండే ఏషియన్ పెయింట్ తరహా కాస్ట్లీ మేకప్ ను వాడితే కానీ బయటకు రారు. కానీ అనుష్క మాత్రం సింపుల్ గా మేకప్ లేకుండా ఎంతో సహజంగా బయటకు వచ్చింది. అయినా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఎంతైనా స్వీటీ ఓ న్యాచురల్ బ్యూటీ అని మరోసారి నిరూపించింది.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో లైక్స్ తో తమ జేజేలు తెలిపారు నెటిజన్లు. ఇక అనుష్క ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'నిశ్శబ్దం' అనే చిత్రంలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మాధవన్.. స్నేహ.. షాలిని పాండే.. మైఖేల్ మ్యాడ్సెన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.