Begin typing your search above and press return to search.

స్పానిష్ సినిమా రీమేక్ కు స్వీటీ రెడీ

By:  Tupaki Desk   |   5 Jun 2019 7:05 AM GMT
స్పానిష్ సినిమా రీమేక్ కు స్వీటీ రెడీ
X
'భాగమతి' విడుదల తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క మళ్ళీ తన కొత్త సినిమా 'సైలెన్స్' కోసం రీసెంట్ గా కెమెరా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'సైలెన్స్' షూటింగ్ ప్రసుత్తం అమెరికాలో జరుగుతోంది. ఈ సినిమా మాత్రమే కాదు అనుష్క మరి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసే దిశగా చర్చలు సాగుతున్నాయట. అందులో ఒక సినిమాకు ఆల్రెడీ స్వీటీ పచ్చజెండా ఊపిందట.

ఈమధ్య స్పానిష్.. కొరియన్ చిత్రాలను రీమేక్ చేయడం సౌత్ లో ట్రెండ్ గా మారింది. సమంతా ప్రస్తుతం కొరియన్ ఫిలిం 'మిస్ గ్రానీ' రీమేక్ 'ఓ బేబీ' లో నటిస్తోంది. అనుష్క ఓ స్పానిష్ చిత్రానికి రీమేక్ లో నటించనుందట. అనుష్క సినిమా 2010 లో రిలీజ్ అయిన స్పానిష్ థ్రిల్లర్ 'జూలియాస్ ఐస్' అనే చిత్రానికి రీమేక్ అని సమాచారం. ఈ రీమేక్ ను తమిళ.. తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. కథ ప్రకారం ఈ సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయిందని.. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి. ఈ చిత్రానికి కబీర్ లాల్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

ఈ కబీర్ లాల్ ఒక సీనియర్ సినిమాటోగ్రాఫర్. బాలీవుడ్ లో 'తాల్'.. 'కహో న ప్యార్ హై'.. 'పర్ దేశ్' లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పనిచేశారు. పలు భాషలలో దాదాపు 100 కు పైగా చిత్రాల్లో సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాతో ఆయన మొదటిసారిగా మెగాఫోన్ చేపట్టనున్నారు. మరి కబీర్ లాల్ తన డెబ్యూ చిత్రంతో అనుష్కకు ఒక హిట్ ఇస్తారేమో వేచి చూడాలి.