Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని ఇలా ఇబ్బంది పెట్టడం ధర్మమా అనుష్క..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 5:39 AM GMT
ఫ్యాన్స్ ని ఇలా ఇబ్బంది పెట్టడం ధర్మమా అనుష్క..!
X
సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి కమర్షియల్ సినిమాలకే కాదు కంటెంట్ ఉన్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి తర్వాత అంత క్రేజ్ తెచ్చిన హీరోయిన్ ఎవరంటే అది కచ్చితంగా అనుష్క అని చెప్పొచ్చు. బాహుబలి తో మరోసారి తన అద్భుత నటన కనబరచిన అనుష్క భాగమతి తో మరోసారి సోలో హిట్ అందుకుంది. ఇక చివరగా నిశ్శబ్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఆ సినిమాతో అంత ప్రభావం చూపించలేకపోయింది.

ఆ సినిమా తర్వాత దాదాపు 3 ఏళ్లుగా ఎలాంటి సినిమా చేయకుండా ఉంది అనుష్క. రీసెంట్ గా నవీన్ పొలిశెట్టి సినిమాకు సైన్ చేసింది. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ ఇంత కెరీర్ గ్యాప్ తీసుకోవడం వల్ల ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సినిమా వెంట సినిమా చేస్తుంటే ఫ్యాన్స్ కి మంచి మజా వస్తుంది. అలాంటి అనుష్క ఇలా లాంగ్ గ్యాప్ ఇవ్వడం నీకు ధర్మంగా ఉందా అంటూ స్వీటీ ఫ్యాన్స్ ఆమెని రిక్వెస్ట్ చేస్తున్నారు.

అభిమానుల కోసమే అనుష్క నవీన్ తో సినిమా చేస్తుందని తెలుస్తుంది. అయితే అనుష్క ఇన్నాళ్లు సినిమాలు చేయకపోవడానికి మెయిన్ రీజన్ సరైన కథ రాకపోవడమే అని అంటున్నారు. తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్న అనుష్క ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేస్తే తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అందుకే తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అనుష్క సినిమాలకు ఓకే చెబుతుంది. నిశ్శబ్ధం ఫ్లాప్ తర్వాత కథల విషయంలో ఇంకాస్త టైట్ చేసిందట అనుష్క.

ఫుల్ నరేషన్ విన్న తర్వాత కూడా వెంటనే ఓకే చెప్పకుండా కొంత టైం తీసుకుని తన డెసిషన్ చెబుతుందట అమ్మడు. అయితే ఆమెని వరుస సినిమాల్లో చూడాలని అనుష్క ఫ్యాన్స్ కోరుతున్నా తను సినిమా చేస్తే అది అంచనాలకు తగినట్లుగా ఉండాలని అనుష్క భావిస్తుంది. అందుకే సినిమా సినిమాకు కొద్దిగా గ్యాప్ తీసుకుంటుంది. నవీన్ పొలిశెట్టితో సినిమా చేస్తూనే మరోపక్క రెండు మూడు కథలు డిస్కషన్స్ లో పెట్టిందట అనుష్క. సో మొత్తానికి మళ్లీ స్వీటీ వరుస సినిమాలు చేయడం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.