Begin typing your search above and press return to search.

అనుష్క తిప్పలు అన్నీ ఇన్నీ కాదు

By:  Tupaki Desk   |   13 Aug 2016 11:53 AM GMT
అనుష్క తిప్పలు అన్నీ ఇన్నీ కాదు
X
అవన్నీ అనుష్క పడుతున్నతిప్పలు మాత్రమే కాదు.. అనుష్క పెడుతున్న తిప్పలు కూడా. పాపం క్యారెక్టర్ లో జెన్యూనిటీ చూపించాలని హీరోయిన్ అనుష్క సైజ్ జీరో సినిమా కోసం చాలా పెద్ద త్యాగమే చేసింది. అయితే అమ్మడు తరువాత వెంటనే సన్నబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బాహుబలి 2 షూటింగ్ చేయాలి కాబట్టి. కాని అప్పుడే సరిగ్గా ఒక ట్విస్టొచ్చి పడింది.

నువ్వు కాస్త మోటుగా ఉన్నా కూడా మాకు ఓకె అంటూ సింగం 3 సినిమా వారు.. పర్లేదులే అంటూ భాగ్మతి సినిమా వారు.. ఇలా అందరూ అమ్మడిని తమ సినిమాల్లో నటించమని అడిగారు. దానితో అనుష్క కూడా టెంప్ట్ అయిపోయింది. ఇంకేముంది.. దానితో ప్రధానంగా బాహుబలి 2 వారికి దెబ్బ పడింది. ఇప్పటికీ అనుష్క ఇంకా బాహుబలి 2 కోసం సెట్లోకే రాకపోవడంతో రాజమౌళి చాలా టెన్షన్ పడుతున్నాడని టాక్‌. ఎందుకంటే ఆల్రెడీ తీయబడిన దేవసేన లుక్ ను అనుష్క మ్యాచ్ చేయకపోతే సెకండ్ పార్ట్ అస్సలు బాగోదు. కాని అమ్మడు మాత్రం ఇంకాస్త ఫ్యాట్ లుక్కులోనే ఉందట.

అయితే ఈ విషయంలో సర్జికల్ రూటులో వెళితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుష్క చాలా నిధానంగా ట్రెడిషనల్ పద్దతుల ద్వారా వెయిట్ తగ్గుతోందట. అందుకే లేటవుతోంది. మరి నవంబర్ లో సినిమా షూటింగ్ అంతా ఫినిష్‌ చేద్దాం అనుకున్న రాజమౌళికి ఈమె సహకరిస్తుందో లేదా హ్యాండిస్తుందో చూడాలి.