Begin typing your search above and press return to search.

బాహుబ‌లిలా ఆయ‌న్ని ఎత్తి అవ‌తలేసిన అనుష్క

By:  Tupaki Desk   |   7 April 2021 3:30 PM GMT
బాహుబ‌లిలా ఆయ‌న్ని ఎత్తి అవ‌తలేసిన అనుష్క
X
బాహుబ‌లిలా ఎత్తి అవ‌త‌లేసింది అనుష్క‌. ఎవ‌రిని..? అంటే.. ఇంకెవ‌రు.. త‌న భ‌ర్త విరాట్ కోహ్లీని అనుష్క శ‌ర్మ అలా సునాయాసంగా గాల్లోకి ఎత్తేసింది. ఇది ఎంత ఫ‌న్నీగా ఉందో వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ ఈ ఫ‌న్ దేనికోసం అంటే.. ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న షూటింగ్ లో భాగంగానే ఇదంతా. భార్యాభ‌ర్త‌ల‌పై ఆస‌క్తిక‌ర షూటింగ్ ఇది. భర్త క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి కొన్ని సరదా సంఘటనల వీడియోను అనుష్క స్వ‌యంగా అభిమానుల‌కు షేర్ చేశారు. ఇది పాత యాడ్ షూట్ నుండి క్లిప్ అని వెల్ల‌డైంది.

వీడియోలో అనుష్క బాహుబ‌లిలా అత‌డిని గాల్లోకి ఎత్తేయ‌డం ఆస‌క్తిక‌రం. విరాట్ ని వెన‌క‌వైపుగా కౌగిలించుకుని గాల్లోకి ఎత్తేప్పుడు `ఇది నేనే చేశానా?` అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తోంది అనుష్క‌. విరాట్ ను వెనుక నుండి పట్టుకుని పైకి లేపుతుంటే.. అతను ఓహ్! అంటూ స్పందించారు. త‌న భార్యామ‌ణి ఏమాత్రం శ్ర‌మించ‌కుండా విరాట్ త‌న‌కు ఎంతో సాయ‌ప‌డుతూ క‌నిపించారు. షూటింగ్ సమయంలో వీరిద్దరూ దానిని చాలా ప్రొఫెష‌న‌ల్ గా తీసుకున్నార‌ని కూడా అర్థ‌మ‌వుతోంది.

ఈ ముచ్చ‌టైన క‌పుల్ జీవితంలో ఇలాంటి ముచ్చ‌ట్లు ఎన్నో. విరుష్క‌ జంటకు 2017లో వివాహమైంది. అప్ప‌ట్లోనే కొద్ది మంది బంధుమిత్రుల‌తో విదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ని ప్లాన్ చేశారు. ఇటీవల తమ కుమార్తె వామికకు స్వాగతం పలికారు. 2015 లో అనుష్క తన మూవీ `బొంబాయి వెల్వెట్` రిలీజ్ స‌మ‌యంలో తాను పెళ్లాడి మంచి త‌ల్లి అవుతాన‌ని పిల్ల‌ల్ని కంటాన‌ని తెలిపారు.