Begin typing your search above and press return to search.

అనుష్క కి నిద్ర‌పోయే టైమ్ కూడా లేదా?

By:  Tupaki Desk   |   26 May 2022 6:30 AM GMT
అనుష్క కి నిద్ర‌పోయే టైమ్ కూడా లేదా?
X
బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ బిజీ షెడ్యూల్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఓవైపు న‌టిగా బిజీగా ఉంటుంది. మ‌రోవైపు వ్యాపారాలు. ఇటీవ‌లే ఓటీటీలో కూడా రంగ ప్ర‌వేశం చేసారు. కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో ఓటీటీలో కి దిగారు. ఇండియాలోనే బెస్ట్ ఓటీటీగా తన‌దైన ముద్ర వేయాల‌ని ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇత‌ర రాష్ర్టాలు తిర‌గ‌డం...బిజినెస్ మీట్స్ ఇలా ప్ర‌తీక్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు.

మ‌రోవైపు కుటుంబం బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. భ‌ర్త‌..పాప‌ని తానే ద‌గ్గ‌రుండి చేసుకుంటుంది. వీట‌న్నింటిని న‌డుమ ఫిట్ నెస్ కాపాడుకోవాలి. వాటి కోసం డేలో కొంత స‌మ‌యాన్ని క‌చ్చితంగా కేటాయించాల్సిందే . గ్లామ‌ర్ ఫీల్డ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతుండాలి. లేక‌పోతే రేసులో వెనుకబ‌డిపోతారు.

ఇలా ఓ సెల‌బ్రిటీ లైఫ్ డేలో ఇంత బిజీగా ఉంటుంది. అందుకే అనుష్క ఎంత బిజీగా ఉంద‌న్న‌ది ఓ ఫోటో రూపంలో ఇప్పుడిలా బ‌య‌ట పెట్టింది. కేవ‌లం రెండు గంట‌లు మాత్ర‌మే నిద్ర‌పోయానని ఓ ఫోటోని ఉద్దేశించి క్యాప్ష‌న్ చేసింది.

''రెండు గంట‌లే నిద్రపోయాను. కానీ నేను ఎంతో ప్రెష్ గా ఉన్నాను' అంది. అంటే అనుష్క ఎంత టైడ్ గా ఉన్నా త‌న‌లో ఆఫీల్ ని ఎక్క‌డా బ‌య‌ట పెట్ట‌కుండా సంతోషంగా డేని మొద‌టు పెట్టింది.

ప‌నిపై డెడికేష‌న్..క‌మిట్ మెంట్ ఉన్న వారు మాత్ర‌మే ఇలా ఉంటార‌ని మ‌రోసారి అనుష్క రూపంలో అర్ధ‌మ‌వుతుంది. అయితే అనుష్క ఫోటోని ప‌రిశీలిస్తే.. ఆమె ఎంత రెస్ట్ లెస్ గా ఉన్నారో అర్ధ‌మ‌వుతుంది. కొత్త ఫోటో షూట్ లో పాల్గొన్న‌ నిద్ర‌లేమిత‌నం ముఖంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో అనుష్క త‌ళుక్కున మెరిసింది. రెండు చేతుల‌కు ఎంపిక చేసుకున్న యాక్స‌రీస‌స్ స‌మ్ థింగ్ స్పెషల్ గా ఫోక‌స్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం అనుష్క శ‌ర్మ 'ఏ మ‌ద‌ర్ ఏజ్' అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. 'చ‌క్ దా ఎక్స్ ప్రెస్' లోనూ న‌టిస్తుంది. ఖాలా' అనే మ‌రో వెబ్ సిరీస్ ని కూడా నిర్మిస్తోంది. న‌టిగా మాత్రం అనుష్క అంత బిజీగా క‌నిపించ‌లేదు. నిర్మాణంపైనే ఎక్కువ‌గా ప‌నిచేస్తుంది. ఓటీటీలో పెట్టుబ‌డి పెట్ట‌డంతో న్యూ ట్యాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తుంది.