Begin typing your search above and press return to search.
పప్ప కోసం పాపాయిలా మారిపోయిన స్వీటీ!
By: Tupaki Desk | 21 April 2022 6:28 AM GMTస్వీటీ అనుష్క రెండేళ్ల గా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. `భాగమతి`..`నిశ్శబ్దం` తర్వాత అనుష్క కొత్త ప్రాజెక్ట్ ఏవి కమిట్ అవ్వలేదు. స్వీటీ సమకాలీకులు అంతా కోలీవుడ్..బాలీవుడ్..టాలీవుడ్ అంటూ దూసుకుపోతున్నారు. కానీ అనుష్క మాత్రం ఎక్కడా ఆ వేగం చూపించలేదు. సమయాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులతోనే గుడుపుతుంది. అప్పుడప్పుడు హైదరాబాద్ రావడం తప్ప ఇంకెక్కడా అనుష్క జాడ కనిపించలేదు.
మరి అనుష్క ఎందుకిలా చేస్తుంది? అవకాశాలు వచ్చినా కాదంటుందా? ఛాన్సు లు రాక ఇంటికి పరిమితమైందా? లేక అంతకు మించి ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్నది ఆమెకే వదిలేయాలి. ఇక నెట్టింట కూడా అనుష్క అంత యాక్టివ్ గా ఉండదు. ఎప్పుడైనా ముఖ్యమైన వారికి విషెస్ చెప్పాలంటేనే అంతర్జాలం ద్వారా అందుబాటులోకి వస్తుంది. విషెస్ చెప్పి అక్కడితో దూరమవుతుంది.
అనవరస పంచాయతీలు నెట్టింట పెట్టదు. ఫోటో షూట్లు వగైరా అంటూ హంగామా కూడా చేయదు. వీలైనంత వరకూ పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటుంది. అయితే తాజాగా ఏప్రిల్ 20న తన తండ్రి ఏ.ఎన్ విట్టల్ శెట్టి పుట్టిన రోజు కావడంతో పప్పకి ఎఫ్ బీలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ``నేను అత్యంత ఆప్యాయత గల..ఉదార స్వభావం గల..బాధ్యతల కలిగి బాగా ప్రోత్సహించే తండ్రిని మిమ్మల్నే చూశాను. మీరు మా కోసం ఎన్నో గొప్ప పనులు చేసారు.
మీరు ఇప్పుడు నవ్వుతూ ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. `హ్యాపీ బర్త్ డే.. మై లవ్లీ పప్ప' అని అనుష్క శెట్టి పోస్ట్ చేసింది. అలాగే పప్ప కోసం అనుష్క పాపాయిలాగా మారిపోయింది. తండ్రితో కలిసి ఫేస్ లో రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ అల్లరి పిల్లగా సెల్ఫీలు దిగింది.ఈ ఫేసుబుక్ పోస్ట్ కి 80 వేల పైచిలుకు లైకులు రాగా మూడువేల కామెంట్లు వచ్చాయి. స్వీటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా అమ్మడి భిమానులు మాత్రం ఎంత యాక్టివ్ గా ఉన్నారో ఈ సందర్భమే నిరూపిస్తుంది.
గతేడాది జులైలో స్వీటీ తల్లి ప్రపుల్లా పుట్టిన రోజు వేడుకలు కూడా నెట్టింట ఇంతే ఘనంగా నిర్వహించింది. అనుష్క ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో అనుష్క తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులైన గుణరంజన్ శెట్టి.. సాయి రమేష్ శెట్టి కూడా ఉన్నారు.