Begin typing your search above and press return to search.

సుచీలీక్స్ పై పోలీస్ కంప్లెయింట్

By:  Tupaki Desk   |   7 Nov 2017 10:29 AM IST
సుచీలీక్స్ పై పోలీస్ కంప్లెయింట్
X
ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలలు అంతా సుచీ లీక్స్ హంగామా ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో చూశాం. ఈ సుచీ లీక్స్ పుణ్యమా అని.. సోషల్ మీడియాని ఉపయోగించే వాళ్ల కౌంట్ కూడా పెరిగిందంటే.. ఈ లీక్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో అర్ధమవుతుంది. సింగర్ సుచిత్రా కార్తీక్ కు చెందిన సోషల్ మీడియా అకౌంట్ లో పలువురు సినీ ప్రముఖులకు చెందిన పిక్స్.. వీడియోస్ షేర్ కాగా.. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారంటూ సుచిత్ర చెప్పుకొచ్చింది.

అయితే.. ఇప్పుడీ వివాదం జరిగి 9 నెలలు గడిచిపోవడంతో.. దాదాపుగా అందరూ పక్కన పెట్టేశారు. కానీ ముంబైలో నివసించే కోలీవుడ్ యాక్ట్రెస్ అనూయా భగవత్.. తాజాగా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కు చెందిన పోలీస్ స్టేషన్ లో.. ఈమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ చేసిన తన ఫోటోలను నెట్ లోంచి తీసేందుకు సహకరించాలని.. ఈ సుచీలీక్స్ వివాదంపై విచారణ జరపాలని కోరింది భగవత్. తనను ఈ ఫోటోలు వ్యక్తిగతంగా నష్టపరుస్తున్నాయని తెలిపింది ఆమె.

బీకేసీ పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసి.. తనకు చెందిన ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్ లో అప్ లోడ్ చేశారంటూ అనూయా భగవత్ తెలిపిందని పోలీసులు చెప్పారు. ట్విట్టర్ కు ఈ సమాచారం చేరవేస్తామని.. ఆమె ఫోటోలను తొలగించాల్సిందిగా కోరతామని పోలీసులు అంటున్నారు.