Begin typing your search above and press return to search.
మహేష్ సర్కారు కి ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్
By: Tupaki Desk | 7 May 2022 5:34 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందిన సర్కారు వారి పాట సినిమా కు ఏపీలో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీలో పెద్ద సినిమాలకు మొదటి వారం రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే.
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు వంద కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని అందుకే ఏపీలో టికెట్ల రేట్లను పెంచేందుకు ఓకే చెప్పారు. పైగా ఆ మద్య ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన సినిమా పరిశ్రమ టీమ్ లో మహేష్ బాబు కూడా ఉన్న విషయం తెల్సిందే. అందుకే మహేష్ బాబు సినిమాకు ఏపీ సర్కారు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఓకే చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ ఎత్తున ఈ సినిమా ను విడుదల చేసేందుకు గాను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేశారు. 10 రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచడం వల్ల భారీ మొత్తంలో ఈ సినిమా వసూళ్లు చేసే అవకాశం ఉందని.. మొదటి వారం రోజుల్లో ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం నుండి జీవో విడుదల అవ్వడంతో త్వరలోనే తెలంగాణ లో కూడా సర్కారు వారి పాట సినిమాకు టికెట్ల పెరుగుదలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే. మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల కాంబో పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే విడుదల అయిన పాటలు సినిమా పై అంచనాలు పెంచాయి. తాజాగా విడుదల అయిన ట్రైలర్ ను సినిమా పై మరింతగా అంచనాలు పెంచాయి. రికార్డు స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా భారీ ఓపెనింగ్స్ పై యూనిట్ సభ్యులు కన్నేశారని తెలుస్తోంది.
సర్కారు వారి పాట సినిమా లో మహేష్ బాబు బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు మరియు అవినీతి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందట. సినిమాలో మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ పోకిరి మరియు దూకుడు సినిమాలను గుర్తు చేస్తున్నాయి. దాంతో ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనే నమ్మకంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు.