Begin typing your search above and press return to search.

ఆచార్యుడికి ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పేసింది

By:  Tupaki Desk   |   26 April 2022 5:30 AM GMT
ఆచార్యుడికి ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పేసింది
X
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ తొలిసారి క‌లిసి న‌టించిన 'ఆచార్య‌' చిత్రం ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లో సంద‌డికి రెడీ అయిపోయింది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని స‌రికొత్త నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత చిరు నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో పాటు తొలి సారి తండ్రీ కొడుకులు చ‌ర‌ణ్‌, చిరు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ఆ దృశ్యాన్ని వెండితెర‌పై క‌ళ్లారా చూడాల‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

గ‌త కొంత కాలంగా క‌రోనా, ఒమిక్రాన్ ల‌తో పాటు పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ ల కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ లో చిరుత‌పులుల్లా చిరు, చ‌ర‌ణ్ స్వైర విహారం చేసిన తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌రింత హైప్ ని క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ఇటీవ‌లే ప్ర‌మోష‌న్స్ ని య‌మ యాక్టీవ్ గా స్టార్ట్ చేసింది.

ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తూ చ‌ర‌ణ్‌, చిరు, కొర‌టాల సినిమాకు మ‌రింత హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి తాజాగా తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు వెసులు బాటుని క‌ల్పిస్తూ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఒక్కో టికెట్ పై మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ. 50 పెంచుకునే విధంగా వెసులు బాటుని క‌ల్పించారు. అంతే కాకుండా సాధార‌ణ ఏసీ థియేట‌ర్లలో టికెట్ కు రూ. 30 పెంచుకునే విధంగా వెసులు బాటుని క‌ల్పించారు.

అంతే కాకుండా 'ఆచార్య‌' ఐద‌వ ఆట‌ని కూడా ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చ‌ని ఉత్తర్వులు జారీ చేయ‌డంతో చిత్ర బృందం తెలంగాణ ప్ర‌భుత్వంకు చిత్ర బృందం కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ఇదిలా వుంటే తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కూడా 'ఆచార్యుడికి గుడ్ న్యూస్ చెప్పింది. 10 రోజుల పాటు టికెట్ రేట్ల‌ని పెంచుకునే విధంగా వెసులు బాటుని క‌ల్పిస్తూ ప్ర‌త్యేకంగా జీవోని విడుద‌ల చేసింది. సాధార‌ణ థియేట‌ర్ల‌లో టికెట్ కు ప‌ది రోజుల పాటు రూ. 50 పెంచుకునేలా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఏపీ ప్ర‌భుత్వం కేవ‌లం 100 కోట్లు బ‌డ్జెట్ దాటిన చిత్రాల‌కు, ఏపీలో చిత్రీక‌రించిన చిత్రాల‌కు మాత్ర‌మే టికెట్ హైక్ చేసుకునే వెసులు బాటుని క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే 'ఆచార్య‌' విష‌యంలో మాత్రం కేవ‌లం చిరు సినిమా కాబ‌ట్టి ఈ నిబంధ‌న‌ల‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి టికెట్ రేట్ ని హైక్ చేసుకునే వెసులుబాటుని క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో సోను సూద్ విల‌న్ గా న‌టించాడు. మ‌ణిశర్మ సంగీతం అందించారు.