Begin typing your search above and press return to search.
#టిక్కెట్టు.. `వకీల్ సాబ్` కోసం వచ్చిన జీవో కాదట
By: Tupaki Desk | 16 April 2021 5:30 AM GMTటిక్కెట్టు ధరల్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో అసంబద్ధం అంటూ పవన్ కల్యాణ్ అభిమానులు సహా ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత నెలకొంది. ఈ జీవో ప్రకారం టిక్కెట్టు ధరలు తగ్గింపుతో థియేటర్లను కొనసాగించలేమని ఒక సెక్షన్ ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. త్వరలో థియేటర్ల బంద్ కి సిద్ధమవుతున్నారని సమాచారం ఉంది. ఇకపైనా పెద్ద సినిమాలన్నిటికీ ఇలాంటి జీవోలు తెస్తారా? అన్న ఆందోళన ఎగ్జిబిటర్లు నిర్మాతల్లో నెలకొంది. దీనిపై సినీపెద్దలు ఏపీ ముఖ్యమంత్రిని కలిసి ముచ్చటించనున్నారని ప్రచారమవుతోంది.
అయితే ఒక సెక్షన్ (చిన్న) నిర్మాతల నుంచి.. ఒక సెక్షన్ ఎగ్జిబిటర్లు (చిన్నవాళ్లు) నుంచి టిక్కెట్టు ధరల తగ్గింపుపై హర్షం వ్యక్తమవుతోంది. ఇంతకుముందు ఏపీ ఫిలింఛాంబర్ జనరల్ సెక్రటరీ మోహన్ గౌడ్ టిక్కెట్టు ధరల తగ్గింపు నిర్ణయం సరైనదేనని అన్నారు. దీనివల్ల సామాన్యులు థియేటర్లకు వస్తారని కుటుంబ సమేతంగా వచ్చి సినిమాలు చూస్తారని అన్నారు. కేవలం హీరోల జేబులు నింపేందుకే టిక్కెట్టు రేట్లు పెద్దగా బాదేస్తురని అన్నారు. ఇదే వెర్షన్ ని మరో నిర్మాత సురేందర్ రెడ్డి కూడా సమర్థించారు.
ఇప్పుడు మరో నిర్మాత.. చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు.. వైజాగ్ ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కూడా సమర్థిస్తున్నారు. నిజానికి ఈ జీవో వకీల్ సాబ్ రిలీజ్ కి ఒక రోజు ముందు రిలీజవ్వడం వల్లనే తప్పుగా అర్థం చేసుకున్నారని ... కానీ ఫిలింఛాంబర్ తరపున తాము చాలా కాలంగా టిక్కెట్టు ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో సామాన్యులకు చిన్న నిర్మాతలకు మేలు చేసేలా ఉందని అన్నారు. టిక్కెట్టును ఇష్టానుసారం ధరలు పెంచి అమ్ముతున్నారనే వకీల్ సాబ్ బెనిఫిట్ షోలను ప్రభుత్వం రద్దు చేసిందని నట్టి సమర్థించారు. వకీల్‌సాబ్ కు వ్యతిరేకంగా ఈ జీవో పాస్ చేశారంటూ తప్పుగా ప్రచారం సాగిందని అది నిజం కాదని నట్టి అన్నారు.
ఇక తన సినిమా ఆర్‌జీవీ దెయ్యం రిలీజ్ ముందు థియేటర్లు మూసేస్తామని పరిశ్రమ అగ్ర నిర్మాత.. పెద్ద ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు మీటింగులు పెడుతున్నారని థియేటర్లు మూసేస్తే కోర్టుకు వెళతామని కూడా నట్టి కుమార్ హెచ్చరించారు. కరోనా కష్ట కాలంలో ఏపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీల్ని మాఫీ చేసి అప్పులపై వడ్డీలు తగ్గించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.